సాహితి

బంగారు జింకపిల్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలనాటి వేణుగానం
పక్షుల కిలకిలా రవాలలో ఇమిడిపోయనట్టు
ఇంతకు ముందెన్నడూ విననతి సమ్మోహన స్వరంతో
రాలిన ప్రతిసారీ ఈ భూమీద పుట్టే కొట్ట మల్లెపూవు ఆ రాచిలుక
ప్రతి నట్టింటా ఛంగుఛంగున దూకే మొలక నవ్వుల సిరి

మనసు స్వచ్ఛమైన దారుల్లో పయనిస్తుంటే
దివ్య లోకాలనుంచి అలలు అలలుగా తేలివచ్చే మహత్తర గానమై
రివ్వు రివ్వున నింగికెగిరే ఉత్సాహానికి ప్రతీక ఆ పాలపిట్ట
ఆకాశానికి నల్ల రంగు పులిమినట్టు
లేలేత అరిటాకులు గుడ్లగూబల పాలౌతుంటే
ఆక్రమణల్ని అరికట్టలేని అసహాయతల్ని చూసి
వీస్తున్న గాలే విస్తుపోతూ నిశే్చష్టై
లిప్తలో భీకర ప్రచండ వేగంతో
ప్రకృతినంతా అతలాకుతలం చేసినా...
శాంతించిన ప్రతిసారీ తిరిగి తిరిగి రేగుతున్న అల్లకల్లోల మధ్య
ఒకే ఒక్క కాంతిపుంజం కదా
అరకొరగా మిగల్చబడిన చిట్టితల్లి బాల్యం?
కన్నీళ్లు అడ్డొచ్చినా కళ్ళు మసకబారినా
జీవిత పర్యంతమూ అదొక్కటే సజీవచిత్రం
అనంతమైన ఉదాత్త రాగాల అమ్మతనం
మొగ్గలోనే తుంచబడే యుద్ధ ధ్వనుల మధ్య
నిరంతర ఉపేక్షిత బంగారు జింకపిల్ల
మన ఇంటి ఆడపిల్ల!

- బులుసు సరోజినీదేవి, 9866190548