సాహితి

కవి కథకుడు కాగలడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్యం, కవిత, కథ, నాటకం, నవల-ఇవన్నీ సాహిత్య ప్రక్రియలు. పద్యాలు, కవితలు రాసేవారిని కవులని, కథలు రాసేవారిని కథకులనడం మనందరికీ తెలుసు. కవితలు రాసే కవి పద్యాన్ని కూడా అవలీలగా రాయగలడు. ఎందుకంటే పద్యానికి కవితకి దగ్గర సంబంధం ఉంది. ఛందోబద్ధంగా రాస్తే కవితే పద్యం అవుతుంది. ఈ రెండింటికీ భాషలో పట్టు వుంటేనే సాధ్యం. ఛందస్సులో అవగాహన ఉండి భాషా పరిజ్ఞానం వున్నవారెవరైనా పద్యాలు రాయగలరు.
కొందరు కవులు తాము కవితలే తప్ప కథలు రాయలేమంటారు. అది ఎంతమాత్రం వాస్తవం కాదు. కవితలు రాసేవారు కథకుల్ని మించి చక్కటి కథలు రాయగలరు. అందులో ఎంతమాత్రం సందేహం లేదు. ఎందుకంటే భాషమీద పట్టువుంటేనే కదా కవిత రాయగలరు. అలాంటప్పుడు కథ ఎందుకు రాయలేరు? కథకుడు ఎందుకు కాలేడు? కథకు కావాల్సిన లక్షణాల్ని అంటే ఎత్తుగడ, ముగింపు, చదివించే గుణం వంటి వాటిని కాస్త అధ్యయనం చేయవలసి ఉంటుంది. అందుకు ప్రసిద్ధ కథకుల కథల్ని చదివితే సరిపోతుంది. అప్పుడు కవి కథకుడ్ని మించి ఉన్నత స్థాయిలో కథ రాయగలడు. కొందరు కవులు కూడా కథల్ని రాయడం గమనిస్తున్నాం. అయితే అలాంటివారి సంఖ్య చెప్పుకోదగినంతగా లేదు. కవితలు తప్ప కథలు రాయలేమేమో అన్న బెరుకే అందుకు కారణం. భాషా పరిజ్ఞానం వుంటే తప్ప పద్యంగానీ, కవితగానీ రాయలేరు. కవులకు ప్రాస, శైలి వీటిమీద చక్కని అవగాహన ఉంటుంది. కాబట్టి వారు కథ రాస్తే మరింత హృద్యంగా వుంటుందనడంలో సందేహం లేదు. ఉదాహరణకు ఒక కథకుడు తన రచనలో సందర్భాన్నిబట్టి ‘ఆమె ఎంతో ప్రేమగా ఉత్తర రాసింది’ అని అంటే కవి అదే విషయాన్ని ‘ఆమె రాసిన ప్రతి అక్షరంలో ఆప్యాయత, ప్రతి మాటలో మమకారం, ప్రతి వాక్యంలో వాత్సల్యం తొణికిసలాడుతున్నాయి’ అని అంటాడు. ఈ రెంటికి అర్థం ఒకటే అయినా శైలిలో తేడా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. కథకి విషయం ఎంత ప్రధానమో అది మనసు లోతుల్లోకి చొచ్చుకుపోగల భాషా శైలి కూడా అంతే ప్రధానం. నిజానికి కథ రాయడం సులభం.
అదే కవిత రాయాలన్నా, పద్యం రాయాలన్నా ఎంతో శ్రమపడాలి. కవులు కథలు రాసినంత తేలికగా, కథకులు కవితల్ని రాయలేరేమో అనిపిస్తుంది. ఆ మాట బయటకు చెప్పుకోవడానికి మనసొప్పని కొంతమంది కథకులు ‘నేను కథలే రాస్తున్నాను. ఇంతవరకు కవితల జోలికి పోలేదు’ అని సమర్థించుకోవడం గమనార్హం. అలా అని కథకుల్లో కవితలు రాసేవారు లేకపోలేదు. అయితే అటువంటి వారి సంఖ్య బహుస్వల్పంగా వుండడం మనకు తెలియంది కాదు. ఏ ప్రక్రియకైనా అధ్యయనం, అభ్యాసం, ఏకాగ్రత ముఖ్యం. ప్రయత్న లోపం తప్ప రాయలేకపోరు. కథ, కవిత, నవల , నాటకం, వ్యాసం ఇలా విభిన్న ప్రక్రియల్లో రచనలు చేసినవారు ఎంతోమంది ఉన్నారు.

- దూరి వెంకటరావు 9666991929