సాహితి

నిశ్శబ్దపు చెరశాలలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడ
మైదానంలో కూర్చుంటే చాలు
నిశ్శబ్దపు చెరశాలలో
బంధీనైపోతాను
రెక్కలు విప్పాలన్న భావాలు
ఆకాశంవైపు చూపుల్ని అతికిస్తాయి
మట్టిపొరల్ని తరిచి తరిచి చూస్తాయి
ఆ గదిలో
ఒక్కో నీడ కనిపిస్తూ మాయమవుతుంది
మరోసారి
స్పష్టమైన చిత్రం... రంగులు పూసుకుంటుంది
హఠాత్తుగా... కురిసిన వానజల్లు
ఆ చిత్రాన్ని చెరిపేస్తుంది
మరలా... నిశ్శబ్దంలోకి దూకిన నేను
కొత్త లోకంలోకి అడుగులేస్తాను
అక్కడి కన్నీటి జలపాతాల వౌనం
నను ప్రశ్నిస్తుంది
సమాధానం కోసం గాలింపు మొదలవుతుంది
భుజంపై... అక్షరాలు వాలుతాయి
గుస గుసలాడుతూ...రెక్కలాడిస్తాయి
ఎదలో... నదీ ప్రవాహం
గల గల మంటున్న భావం
మలుపులు తిరుగుతుంది
ఆ ప్రవాహం ఆగిపోతుంది
ఆ ప్రాంతమంతా ఎడారిగా మారుతుంది
దాహం వేసిన దేహం
ఆ ఎడారిలో... అడుగులేస్తుంది
రాలిన అక్షరాకులు
భావాల సుడిగుండంలో
సుడులు తిరుగుతూ... అలసిపోతాయి
ప్రశాంతమైన రాత్రి... చీకటిలో
కొత్త చైతన్యం ఊపిరి పోసుకుంటుంది
ఒక కొత్త దృశ్యం... ఆవిష్కృతమవుతుంది
తెరలు తెరలుగా
భావాల అలలు తీరానికి చేరుకొంటాయి
ఆ తీరంలో ఇంకిపోతాయి
ఇసుకను తడిచేస్తూ.
మసక మసక చీకట్లో
కాంతి కిరణాల వెలుగు ఉదయిస్తుంది
కవిత్వమై... కవి హృదయమై...!

- కెరె జగదీష్, 9440708133