సాహితి

కాల రహస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం వెనుక దాగున్న
రహస్యాన్ని ఎవరు
విప్పి చెప్పగలరు?
ప్రజల నానుడి
నొక్కిపెడుతున్న
పాలకులకు
బడికంటే ఈరోజు
గుడి మాత్రమే నడవడి సూత్రం!

ఆశల అడియాసల
ఎండమావుల్లో
దుక్కిదునే్నవాడు మన్ను తింటున్నాడు,
దేవ రహస్యమైపోయిన కాలం
భక్తివ్యాపారుల చేతుల్లో ఒక సరుకు.!
శైలీ విన్యాసంలో
దోబూచులాడే రూపవాదులకు
సహజ సౌందర్యం - సరళత్వం -
అసలే అంతుపట్టవు,
జీవన యధార్థాలను
నిర్భయంగా నిలదీస్తే -
ఈ కాల రహస్యాన్ని
మనమే విప్పి చెప్పగలం!!

- నిఖిలేశ్వర్, 9177881201