సాహితి

ఆకలి కేకల అరపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రహదారి కూడళ్ళలో కూలీ వ్యధలు
అరణ్య రోదనలు మించిన ఆర్తనాదాలు
అరుణోదయంతో అంకురించు వెతల గతులు
ఆటోలకై బస్సులకై రైళ్ళకై ఆదుర్దా అరపులు
పనీ... పనీ... అని పయనపు ప్రణాదములు
పరువు కోసం పసాదం కోసం ప్రాకులాడే పరిదేవనములు
దొరా! ధనీ! అని బిక్కముఖంతో బతిమాలటాలు
అయ్యా! సామీ!.... అనీ అర్ధింపు ఆకలి అరపులు
మధ్యవర్తుల నిరీక్షణలో మతిభ్రమించిన కబుర్లు
మట్టి పనైనా ఎట్టిపనైనా పొట్టతిప్పల కేకలు
చేస్తామనే అరపులు చేవ చూపిస్తామని సవాళ్ళు
మధ్యవర్తుల మత్తు మాటలకు మోసపడ్డ అరపులు
పనిభారం తెలిసి కూలి పెంచమని నిరసనలు
పని దొరక్కపోతే తిరుగు పల్లెవైపు ఉరకలు
మిట్ట మధ్యాహ్నం దాక మతి తప్పిన సణుగుళ్ళు
పస్తులుండి పట్టెడన్నంకోసం పనివ్వమని అరపులు
తిరుగు పయనానికి రొక్కం లేదని రోదనలు
తమ దగ్గరివేమైనా తాకట్టు పెట్టలేని రొదలు
సంధ్య పయనంలో ‘రాతిరికెలా’ అని సొదలు
కన్నవారిని ఆదుకోలేక పోతున్నామని దిగులు అరపులు
తట్టాబుట్టా పలుగూపారల ప్రణినాదములు
గుంటిక చలిక నాగలి కొడవలిల ఆక్రందనములు
ఎడ్లబండ్లు కళ్ళాలు గాడుపాళ్ళ గోడులు
శుకపికాల కల కూజిత పిచికల కొదవైన అరపులు
పల్లెల్లో అరపుల ఆరంభం ఎపుడో!
పట్నాల్లో అరపుల అంతం ఎన్నడో!
పల్లెల్లో వలసలు ఆగేదెన్నడో
ఇరు సంధ్యల కదలికల్లో అభ్యుదయం ఉన్నపుడే!

- మండ్ల జయరాం, 9440107260