సాహితి

వేకువ పిట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెలుగు వెల్లువ రాకుండానే
కడుపు నిండా కొత్త కబుర్లతో
రెపరెపలాడుతూ వేకువ పిట్టలా
మా ముంగిట్లో వాలుతుంది!
విభిన్న కథనాల జ్ఞాపకాలతో
గతం ఒడిలో ఒదిగిపోవడానికి
పయనమవుతున్న ప్రపంచాన్ని
నా కళ్లముందు సాక్షాత్కరింపజేస్తుంది!
నా చుట్టూ ఏం జరుగుతుందో
నాకు తెలియకుండానే పసిగట్టి
నన్ను అప్రమత్తుణ్ణి చేస్తుంది!
విజ్ఞాన విహంగాలై విహరిస్తున్న
మా పిల్లల మెదడుకు మేత వేస్తూ
సరికొత్త పజిల్స్ తీసుకొస్తుంది!
ఉద్యోగ ప్రకటనలు చూపించి
మోడుబారిపోతున్న నా ఆశలను
మళ్లీ మళ్లీ చిగురింపజేస్తుంది!
ఆధ్యాత్మికతను ఆది గురువులా బోధించి
నన్ను సన్మార్గంలో నడిపిస్తుంది!
‘మంచి మాట’లను మా అవ్వలా చెప్పి
మనసుకి సాంత్వన పరుస్తుంది!
ఒత్తిడి కౌగిలిలో బిగించుకుపోతూ
ఆనందం కరువై అలమటిస్తున్న నాకు
సినీ సంగతుల సమాహారంతో
వినోదాన్ని వడ్డిస్తుంది!
వారానికొక్కమారు ప్రత్యేకంగా తయారై
కవి హృదయాన్ని నాకందించి
తానొక సాహిత్య రాయబారి అవుతుంది!
తన రాకతో పొద్దుపొడిచే నాకు
రోజంతా వికసించిన కమలంలా వుంటుంది!
తనని చూడని రోజు
రోజంతా రెక్కలు తెగిన పక్షిలా వుంటుంది!

- బొద్దూరు విజయేశ్వరరావు, 8985079163