సాహితి

కథా పల్లవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్పనిక రచనలు, వాటి చరిత్రకు సంబంధించిన వివరాలను ఒకచోట స్థావరింపచేయడం సముచితం అయిన పని అయినా, అది అంత సాధ్యమయినది కాదు. రచనలకు కళాత్మకమయిన సిద్ధాంతాలు తప్పనిసరిగా వుంటాయి.
అయితే రుూ సిద్ధాంతాలను యధాతథంగా ఆచరించి రచనలు చేస్తే ‘కుక్కమూతి పిందెలు’ బయటపడతాయని కొందరు అభిప్రాయపడతారు. సిద్ధాంతాలు ప్రాతిపదికలుగా- చెట్టు కాండంగా ఉపయోగించుకుని, వాటిపై కొమ్మలు రెమ్మలు అమర్చుకుంటే యిటువంటి ప్రమాదం వుండదు. కథా రచయితలు ఒక గుంపు అయితే, చదువరులు మరో గుంపు. వాళ్లు యిద్దరికీ సంధానం చేసే విమర్శకులు మరో గుంపు. మామూలు పాఠకుడు ఒక కథ చదువుతాడు. తరువాత రెండు మూడు వారాల తరువాత, ఆ కథను గురించే ఒక విమర్శకుడు వ్రాసిన ప్రశంసనో, అభిశంసననో చదువుతాడు. అప్పుడతనికి అనిపిస్తుంది. ఈ విషయం నాకు ఆ కథ చదువుతున్నప్పుడు అనిపించలేదే, తట్టలేదే అని. విమర్శకుడి అభిప్రాయాలు ఎంతవరకు నిజమో- ఎంత నిజం కాదో తెలుసుకోవటానికి ఆ కథను మళ్లీ చదువుతాడు. తనకు తానే నిగ్గు తేల్చుకునే ప్రయత్నం చేస్తాడు.
కథలు రాయడంలో అభిరుచి లేకపోయినా, కథలు చదివేవాళ్లకు ఒక రకమయిన ‘అప్రిషియేషన్ కోర్స్’లో అవసరం వున్నాయి- అనేది యింకా ప్రచారంలోనికి రావలసిన విషయం. వౌలికమైన విషయాలు తెలియకపోతే చదివినదానిని అవగాహన చేసుకోవడం - ‘కవి హృదయం’ పట్టుకోవడం మాట దేవుడెరుగు- కష్టం అయిపోతుంది. కాలక్షేపం కోసం కాకుండా ‘కళాత్మకత’ కోసం చదివేవాళ్ల విషయంలో యిది యధార్థం! కథకు ఓ ప్రయోజనం వున్నదనీ, దాన్ని రాసినవాడు ఒక రకమయిన ఆలోచనలను చదివే వాళ్ల బుర్రలలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడనీ, తెలిసి వుండడం అవసరం. కథకు ఓ అర్థం వుంది. సీరియస్‌గా ఆలోచిస్తే అంతరార్థం కూడా వుంది. మరీ లోతుగా చూడగలిగితే అందులోనే పరమార్థం కూడా వుంటుంది. ప్రపంచంలో పనికిరాని వస్తువు ఏదీ లేదని అంగీకరించేవాళ్లు - రుూ అభిప్రాయంతో తేలికగానే అంగీకరిస్తారు.
రచయితకు చదువరులను ఆకట్టుకోవడం అత్యవసరం. దానిమీదనే అతని గుర్తింపు, పారితోషం, నైతికత, కళాత్మకత ఆధరాపడివున్నాయి. కథానిక అనేదానికి సాహిత్య గౌరవం ఏర్పడి చాలాకాలం అయినా, కథలపట్ల మనకు ‘చిన్నచూపు’ వుండడం మటుకు సామాన్యం అయిపోయింది. కథానిక అంటే మనకు నిర్లక్ష్యం వున్నదని అన్నపుడు ఎవరికైనా వెంటనే ‘యిది అబద్ధం’ అనిపిస్తుంది. వెంటనే అంగీకరించబుద్ధికాదు. ఎందుకంటే- ప్రతి పత్రిక ఒక్కో సంచికలో రెండు మూడు కథలు ప్రచురిస్తుంది. దినపత్రికలు కూడా ఒకసారి కథలు ప్రచురిస్తాయి. కాని కథలకు మాత్రమే పరిమితం అయిన పత్రికలు మనకు లేవు. కథలు, కథల చరిత్ర, కథ గురించి విమర్శ వ్యాసాలు, సమీక్ష సంశే్లషణలు మాత్రమే ప్రచురించే పత్రికలు మనకు లేవు. ఈ విషయం చాలామందికి గుర్తుకు, గమనానికి రాదు కూడా! అటువంటి అవసరం వున్నది అని తెలియచెప్పటానికి ప్రయత్నించినా ఆ మాటలు ప్రచురణకర్తలు చెవులకు ఆనందంగా చేరవు. వాణిజ్యపరంగా యివి ప్రయోగాత్మకం కావని చాలామంది అభిప్రాయం. కొత్తరకం ఆలోచనను చివరంటా ప్రయత్నించి చూచి ఫలితం నికార్సుగా తెలుసుకుందామనే తీరుబడి ఎవరికీ లేదు.
వార్తా కథనాలను కూడా ‘కథల’లాగానే మలిచి ప్రచురించడం అయినందువల్ల కథానిక పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకపోవటానికి ఒక కారణం అని చెప్పుకోవచ్చును. నిజానికి జీవితం కల్పన సాహిత్యం కంటే విచిత్రం, అద్భుతం అయినది కదా! జీవితం మనుషుల్ని తిప్పే మలుపులు, కథల్లో చూపించినప్పుడు ఒక్కోమారు అతిశయోక్తిగా కనిపిస్తుంది. అవి అతిశయాకులుగా రూపొందుతాయి.
కథలో వుండే సంయుక్తత వార్తాకథనంలో వుండకపోవచ్చును. నాటకీయత, కథాచలనం కొరబడవచ్చును. ఒకే పాత్ర, ఒకే సన్నివేశం, ఒకే స్పందన వుండే కథానికకు వార్తా కథనానికి పోలిక లేదు. అంతేకాదు, కథలో దొరికే సంక్షిప్తత, సంపూర్ణత యిక్కడ దొరకకపోవచ్చును.
ఒకప్పుడు ప్రణయ కథలు, సంసారిక కథలే ఎక్కువ చెలామణిలో వుండేవి. కాని కాలక్రమేణా పరిస్థితులు, జన స్థితిగతులు యేర్పాటు చెందాయి. సాంఘిక, రాజకీయ, ఆర్థిక ప్రభావాలు జన జీవనాన్ని సముచితంగా మార్చివేశాయి. ఒకప్పుడు హాస్యం అనుకున్నది యిప్పుడు ఎబ్బెట్టు అయిపోయింది. ఒకప్పుడు చాపలు, చదరలమీద కూర్చునే మనుషులు యిప్పుడు సోఫాలలో తప్ప కూర్చోలేకపోతున్నారు. అభివృద్ధి అన్ని కోణాలనించి మనిషిని పైకి తీసుకువెళుతోంది. దాంతోపాటు మానసిక, బౌద్ధిక ప్రగతి కూడా రాకపోవడం, కథా వస్తువులను విరివిగా తయారుచేయగలుగుతోంది. దళిత కథలు ‘ఆనర్ కిల్లింగ్’ మిషతో జరిగే హత్యలు యిందుకు ఎంతో ఉదాహరణాత్మకంగా కనిపిస్తాయి.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584