సాహితి

శూన్యంలో హృదయ రాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు -
కంటి చివర కన్నీటి చుక్కలేదు
మూసి ఉన్న పెదవుల మధ్య మాటలు లేవు
స్నేహ హస్తాల కరచాలనాలు లేవు
నీ కోసం పాదాల మధ్య పరుగులు లేవు
భావాలు లేక
హృదయం మూగబోయింది
ఊహలు లేక
మనసు శూన్యమైంది
ఒకరి ఊపిరి ఆగిపోయింది
ఒకరి ఆర్తి ఆవిరైపోయింది
నీ నిరీక్షణలో ఒక జీవితం ముగిసింది
మూతబడిన రెప్పల మధ్య
ఎదురుచూపు బందీ అయింది
చుట్టు ఎన్నో అడుగులు
ఎందరివో నీరాజనాలు
ఎందరివో నివాళులు
ఏవీ తనని చేరుకోలేవు
ఎవర్నీ తను చేరుకోలేదు
అంతలో అక్కడ -
జీవిత కాలం ఆలస్యమైన అడుగులు
స్నేహాన్ని పంచుకోలేని హృదిని
అభిమాన తడిలేని మదిని
ప్రకృతి అంతా తలవంచి జాలిగా చూస్తోంది
ఎక్కడో, ఏవో దూర తీరాల్లో
ఒక ఒంటరి పక్షి
ఆర్తిగా, స్నేహగీతం ఆలపిస్తూనే ఉంది

- డి.స్వర్ణ శైలజ, 8500632936