సాహితి

ఓ ఉషోదయ వేళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ ఉషోదయ వేళ
తమ కిలకిలారావాలతో ప్రభాతానికి
రాగాల హారతి పడుతున్న
పక్షుల సవ్వడి విని
నెమ్మదిగా కళ్లు తెరిచా!
ఇంకేముంది?
ఉదయం ఆరుగంటలు దాటిందని
గోడ గడియారం
వెక్కిరింపులు ఒకవైపు
కిటికీలోంచి దూరి
తమ కిరణాలతో భానుని
చెక్కిలిగింతలు మరోవైపు!
ఆవలింతలతో
తనువంతా పులకరిస్తుంటే...
కలలో నన్ను
అలరించిన మధుర ఘటనలు
ఒక్కొక్కటి నా మనోఫలకంపై
నాట్యమాడసాగాయి!
స్వప్నంలో ఎంచక్కా
తొలకరి జల్లులో తడుస్తూ
ఒక్కో చుక్కను దోసిట్లో
ఒడిసిపట్టిన సంగతి గుర్తుకొచ్చి
అరచేతుల్ని ఆత్రంగా చూశా!
ఒక్క బొట్టు లేక...
అవి బోసిపోవడం గమనించి
అవాక్కయ్యా!
చిలిపి చేష్టలతో
నన్ను ఊహల ఊయలలూపిన
స్వప్న సుందరికై ఆరా తీశా!
ఎంతకూ చిక్కక చిన్నబోయా!
కలలో పోగొట్టుకున్న
వేయి రూపాయల నోటు కోసం
ఇల్లంతా గాలించా!
ఎంత వెతికినా దొరకక కంగుతిన్నా!
ఇక తెలుసుకున్నా
నిద్రలో కన్న కలలన్నీ
తాత్కాలికంగా మురిపించే మువ్వలనీ
కళ్లు తెరవగానే
అవి కనుమరుగవుతాయనీ!

- దాస్యం సేనాధిపతి, 9440525544