సాహితి

గమనాగమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంట్లో జీవనదిని
ప్రవహింపజేసిన భగీరథుడెవరో
పెదవుల్ని యిసుక తినె్నలు చేసి
చిరునవ్వు తీవెల్ని రాల్చి
పచ్చని నేలపైన
విచ్చుకున్న చల్లని వెనె్నల పూలని
వెచ్చని వడగాడ్పులకు బహూకరించి
రాత్రి కలల నిండా
ఎడారుల బిడారుల్ని అలంకరించి
నేలకి చీకటి దుప్పటి కప్పిన మహర్షి ఎవరో
శోకాన్ని అశోక వృక్షపు పాదులో
సోమధారగా సేచనం చేసి
జీవన మహాసాగర తీరాన
వొంటరి దీపస్తంభంలా నిలబెట్టి
సుఖ దుఃఖాల ఉదయాస్త సమయాల్లో
అస్తమయ క్షితిజ రేఖ కింద
అనాథలా వొదిలేసిన దేవర్షి ఎవరో
ఈ అస్థిరాస్థి సమూహంపైన
వొకానొక చర్మాంబరాన్ని కప్పి
మాంసపు ముద్దలో కిరణ శకలం కొసరి
ప్రాణం పల్లవించిన ప్రతిమని
ఇన్నిన్ని బొమ్మల నడుమ నాటకీయంగా
మమతల రంగు దారాలు బిగించి
వొదిలిన విధాత ఎవరో
ఇప్పుడు నేనిలా
వర్ణార్ణవ స్వప్న సంచయాల నడుమ
దారితప్పిన వొంటరి బాటసారిని!

- ఈతకోట సుబ్బారావు, 9440529785