సాహితి

దారికాచిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బయట మంచు తునకలు
గుండెల్లో నిప్పుకణికలు
వెలుపల వెనె్నల సోనలు
హృదయాంతరాలలో వేడి నిట్టూర్పులు
అతి చల్లగా సోకుతున్న శీతల వాయువులు
అపాద మస్తకం ప్రకంపనాల ఆవిర్లు
సుతిమెత్తని పరుపుపై సుఖాసనాలు
మొన తేలిన కఠిన శిలలపై కూర్చున్న చందనాలు
సెలయేటి తుంపరుల్లా ఆలోచనా పరంపరలు
దేహ పర్యంతం భీతావహ స్వేద బిందువులు

నలు దిశల ప్రమాద చిహ్నాలు
ప్రళయకాల సూచనలు
పరమ భయానకం అష్టదిక్కులా వ్యాపించి
మనస్సు పరిపరి విధాల పారాడుతున్నసమయాన
అంతులేని, అవధిలేని ఆశ్చర్యార్థక దృశ్యం ప్రత్యక్షం
అమాంతం పండు వెనె్నల కారుచీకటై
కరిమబ్బు క్రమ్ముకుంటున్న దృశ్యమానం
ఉన్నపళంగా ఆకాశం జలపాతమై దృశ్యపరంపరం
ప్రచండ మారుతం పరమవేగ గతిన
పరిసరాలను వికలం చేస్తున్న దృశ్యావలం

ఎండిన కొమ్మపై గుడ్లగూబ
కనుగుడ్లు మిటకరిస్తున్న దృశ్యవలయం
గబ్బిలాలు ఫెళపెళా కలకలం రేపుతూ
పలు వైపులా వ్యాపిస్తున్న దృశ్యగతం
కబోధి పక్షులు ఊడలమర్రి నుంచి తలకిందులుగా
ప్రకృతిని వికృతంగా చూస్తున్న దృశ్యరూపకం
తీతువ పక్షి వెర్రి చూపుల
పరమ వికార హాహాకార ధ్వని ధ్వానం
గుంటనక్క శ్మశానవాటిక నుంచి
అతి భీకరంగా ఊళ శబ్ద ఉద్ఘాతం.
ఎక్కడినుంచో దౌర్జన్యం పర్జన్యమై
పాంచజన్యం పూరించిన ధ్వని నిర్ఘాతం
ఇంకెక్కడి నుంచో అపర కీచకుల
కాముక హస్తాలలో చిక్కిన అబల ఆర్తనాద నిర్ఘోష్యం
మరెక్కడినుంచో క్రౌర్యం క్రూరంగా
కబళించ నెంచగా భయోద్విగ్నంగా
నగ్నంగా పరిగెడుతున్న పద ధ్వాన ఉత్పాతం
ప్రక్కనుంచే కాఠిన్యం కార్చిచ్చులా వ్యాపించి
దురాశగా యోచించి సర్వం దోచనెంచగా
భీతిల్లిన హృదయ విదారకపు గావుకేకల ఉద్ఘోషనం
ఎదుటనే స్వార్థం సహస్ర ముఖాలుగా
విస్తరించిన వికటాట్టహాస ఊత్కార చీత్కారం

ఈ రాత్రి మహోత్ఖాత బీభత్సం
నేటి సమాజపు ప్రతిరూప సదృశం
శని, కలి కలగలసి సాగిస్తున్న ప్రాపకం
దుష్ట సమాజపు కుళ్ళు ప్రక్షాళనకు
కల్కి అంకుశపు ముల్కి చేబూని
ప్రభవిస్తాడన్న భావన కొందరిది
ప్రజే కల్కి అవతారం దాల్చి
దుష్టకీటకాలను ఊడ్చి పారేస్తే
రేపటి ప్రొద్దున
నవోదయపు వాకిళ్ళు తెరుచుకోవా!
అన్న యోచన మరికొందరిది.

- కాశీవరపు వెంకట సుబ్బయ్య, 9849800389