సాహితి

కథా లాలిత్యం (శ్రీవిరించీయం 6)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథావస్తువు అనేది లేకపోతే అసలు కథే లేదు. అయితే వస్తువు, దాని నాణ్యతతోపాటు కథ ఎలా చెబుతున్నాం- కథాకథనం అనిపేరు దీనికి- అన్న విషయం మరింత ప్రధానం.
మంచి వస్తువును తీసుకుని చెడ్డ కథ వ్రాయడం చాలమంది చేసే సామాన్యమయిన పని. దుస్తులు, వలువలు, కట్టుకున్న తరువాత ఆ మనిషి అందం యినుమడించి గాని, ఆ వస్తువుల నాణ్యత దిగజారిపోగూడదు. తాము ధరించిన వలువల విలువలను పాడుచేస్తున్న వాళ్లను మనం దైనందిన జీవితంలో చూస్తూనే వుంటాం. కథ విషయంలో కూడా రుూ యదార్థత గమనించగలగడం శ్రేయస్కరం. వస్తువు మంచిదే గాని, రుూ కథను యింతకన్నా నేనే బాగా రాయగలను, అని చదువరిచేత అనిపించుకోకుండా వుండ డం రచయితకు రాణింపు. చెడిపోయిన కథను బాగుచేయడం ఎంతో కష్టమయిన పని. ఆ పనికి పూనుకోకుండా, సరికొత్త కథ వ్రాసుకొనడం బుద్ధికి లక్షణం. కథాంశాలు, కథాంగాలు సరిచేసుకుంటూ కూర్చోవటంకంటే కొత్త రూప నిర్మాణం చేసుకోవడం సబబయిన పనికదా!
భర్తృహరి చాల శతాబ్దాల వెనకనే చెప్పినట్లు, నీటిబొట్టు ముత్యంగా తయారవాలంటే, అది యిసుకలోనో, మట్టిలోనో పడిపోయి యింకి పోగూడదు. చక్కని ఆలుచిప్పలో పడాలి. కథావస్తువు, సక్రమమైన కథాగమనం లేకపోతే కథే లేదు. దానిని రాయవలసిన అవసరం అసలే లేదు. ఏ కథావస్తువునయినా రాణించేట్లుగా రాయడానికి ఎంతో కథన పరిశ్రమ, పరిక్రమ అవసరం. అది నేర్చుకుంటే వద్దని కాకపోవచ్చును గాని, రచయితలో సృజనాత్మకత లేకపోతే మటుకు అసాధ్యం, అసంభవం అయిపోతుంది.
రూపము, శైలితోపాటు విషయ ప్రాధాన్యం కూడ ముఖ్యం. రచయిత చెప్పదలుచుకున్నది చెప్పే విధానంకంటె మిన్నదే అయి వుండాలి. కథలో యేమీ జరగకపోతే- గమనం యుక్తంగా లేకపోతే అది కథేకాదు. దానిని రాయడం ‘శుద్ధదండగమారి పని’ అని చెప్పవచ్చును. కథకు పాత్రల గమనం, మనోవేగం, పరిణామం చాల అవసరం. కథను వ్రాయడంలో సౌలభ్యం సమకూడాలంటే, రచయిత ‘పాత్ర’గా తయారయి కూర్చోకూడదు. అతనే పాత్ర అయితే, యితర పాత్రల మనసులలో దూరి వాళ్ల అంతరంగ భావనలను తెలియచెప్పడం విడ్డూరంగా తయారవుతుంది. చదువరినే పాత్రగా తయారుచేసి కథ చెప్పడం ఎక్కువమంది ప్రయోగం చేయని ప్రక్రియ. కథలో మరో ఒక పాత్ర పరంగా కథను నడిపించడం బహుతేలిక అయిన మార్గం. పాత్రలు మాట్లాడే పద్ధతి, వాళ్ల అంగ విన్యాసాల వర్ణన వారివారి అంతరంగాన్ని బయలు పరుస్తాయి. అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ పోవడమే రచయిత చేసే పని. సమాంతరంగా వున్న ఆలోచనలు చివరకు ఏకమైపోవడమే కథకు మంచి ముగింపుగా తయారవుతుంది. జీవితంలో యోగ్యమయిన పద్ధతిగా రూపొందుతుంది.
కథలు వ్రాయడం నేర్చుకోవచ్చునా? కాదని చెప్పేవాళ్లకంటె, అవునని సమాధానం యిచ్చేవాళ్లు ఎక్కువ. ముద్దార నేర్పించినప్పుడు నేర్వని విద్యలు లేవు. అయితే రుూ ‘ముద్దమందారం’ ఎక్కడ దొరుకుతుందో వెదికి పట్టుకోగలగాలి.
రచయిత యితరుల రచనలను చదవడంవల్ల, వాళ్ల ప్రభావం అతన్ని పాడుచేస్తుంది- అనే అభిప్రాయం వున్నవాళ్లు కూడా ఎక్కువ మందేవున్నారు. ఇతరుల రచనలు చదవకపోతే- ప్రపంచం ఎలా నడుస్తోందో తెలియడం కష్టం. చదవనివాడు ‘అజ్ఞుడు’ అవుతాడు. చదివితేనే ‘సద సద్వివేక చతురత’ కలుగుతుంది. నేర్చుకుంటే వచ్చే విద్యలు అనేకం వున్నాయి. ప్రతి మనిషిలోనూ కొంత ‘సృజనశక్తి’ సహజంగానే వుంటుంది. దానిని సాన బట్టుకుని రచయితగా రూపుకట్టుకుందుకు అవకాశం వుంది.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584