సాహితి

అక్షర శిల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరం మాతృభాష మాధుర్యం తాగించింది
పరభాష ఔన్నత్యం చూపించింది
మేనాలో మేఘాలపై వూరేగించింది
సముద్రాన్ని లంఘించి దాటించింది!
కోకిల సుధాగీతానికి
పావురాయి కుహుకుహు రాగానికి
అక్షర విన్యాసం వుంది
పరదేశంలో స్వదేశాన్ని పొగిడినా
స్వదేశీలో పరదేశాన్ని కీర్తించినా
అక్షర ప్రఖ్యానమే!
అక్షరానికి ఎల్లల్లేవు
ఐక్యరాజ్యసమితిలో అక్షరం ప్రబలితే
ఎన్ని అక్షర కరతాళ ధ్వనులు
అభినందిస్తాయో ఆశీర్వదిస్తాయో!
ఇంటికి అలంకారం అక్షరం
వొంటికి సోయగం అక్షరం
అక్షరం నవరసాలు అభినయిస్తుంది
దశావతారాలు ప్రదర్శిస్తుంది
హృదిలో చేరిన అక్షరాన్ని
ఎవరూ దోచుకోలేరు మదిలో దాగిన అక్షరాన్ని
ఎవరూ మాయం చేయలేరు!
అక్షరం నాలుకపై జీవం
కళ్ళల్లో కాంతి, ముఖంలో తేజస్సు
అక్షరం అశ్వమేధం, అక్షరం జైత్రయాత్ర
నన్నయ తిక్కన ఎర్రన - జీవించే వున్నారు
అక్షరం చేబట్టి తిరుగుతున్నారు!
అరచేయి అడ్డుపెడితే అక్షర ప్రభావం ఆగదు
ఆయుధం ప్రయోగిస్తే అక్షర క్షయం జరగదు!
అక్షరం విప్లవిస్తుంది అక్షరం శపిస్తుంది
దీవిస్తుంది శిల్పిస్తుంది
అక్షరం మనోజ్ఞం, అక్షరం అఖర్వం!

- అడిగోపుల వెంకటరత్నమ్, 9848252946