సాహితి

సింక్లేర్ మ్యానిఫెస్టో తెలుగు సిగ్నేచర్ రావిశాస్ర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

30న రాచకొండ విశ్వనాథ శాస్ర్తి జయంతి

రా.వి.శాస్ర్తీ ఓ మంచి రచయిత. కారణం.. ‘మంచి రచయితలు లోకం కోరింది రాయలేదు.. వారు రాసిందే లోకం చదివింది’. పాఠకుల
అభిరుచికి, రచయిత చెప్పదలుచుకున్న సందేశానికీ నిరంతరం జరిగే పోరాటమే సాహిత్య చరిత్ర. ఒకర్ని నమ్మించడానికి ఆయన రచనలు చేయలేదు.. కొంతమంది రచయితలు ‘ప్రపంచం ఇలానే ఉంది.. ఉంటుందనే’ చట్రంలో ఉంటారు. కాని.. శాస్ర్తీగారు ‘ప్రపంచం ఇలా ఉంది.. కాని, ఇలా ఉండకూడదు’ అని చెబుతూనే
ఎలా ఉండాలో చెబుతారు.

అప్టన్ సింక్లేర్ (1878- 1968) గురించి 1905 దాకా పాఠకులకు తెలియదు. చిత్రంగా... తరువాత నాలుగు దశాబ్దాలపాటు ఆయన అమెరికన్ రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య జీవితాన్ని శాసించాడు. తొలిగా అతను రచించిన ‘ది జంగిల్’ (బీఫ్ ఫ్యాక్టరీలోని అనారోగ్య పరిస్థితులపై ఎత్తిన తిరుగుబాటు జెండా) సంచలనం సృష్టించింది. దీనిని గురించి వ్రాస్తూ బెర్నార్డ్‌షా ‘తమ స్వార్థ ప్రయోజనాల కోసం పెట్టుబడిదార్లు ఎంతటి దారుణాలకైనా వెనుదీయరని నిరూపించిన పుస్తక’మంటాడు. తరువాతి రచన ‘ది మనీ చేంజర్స్’ (1908). ఆనాటి ధనిక పారిశ్రామికవేత్తలు ప్రజల్ని మోసం చేసిన పద్ధతుల్ని ఆ గ్రంథంలో ఎత్తిచూపాడు. సింక్లేర్... సామాజిక న్యాయం అతడి ఉద్యమ స్ఫూర్తి... ‘ది బ్రాస్ చెక్’ (1919), ‘మనీ రైటర్స్’ (1927), ‘మమనార్ట్’ (1925), ‘ఆయిల్’, ‘బోస్టన్’ (1928) వంటి రచనలు ఆయన సాహిత్యంలోని పదును, వేడి...వాడిని తెలుపుతాయి. సింక్లేర్ రచనలలో కొత్త భావాలు, నవ్యత ఏమీ లేవు. ఇతని రచనల్లో అభిప్రాయాలెక్కువ, పాత్రోచిత చిత్రణ తక్కువ అనే విమర్శలున్నాయి. కాని... సింక్లేర్ రచనల ప్రభావం అమెరికాకే పరిమితం కాలేదు. రష్యాలోని సామాజిక నేపథ్యాన్ని కుదిపాయి. జర్మన్ నాటక రచయిత ప్రయోక్త బెర్టోల్డో బ్రెక్ట్, రష్యన్ సినిమా జీనియస్ సెర్గీ ఐసెన్‌స్టీన్, హెర్బర్డ్ మార్క్యూస్ వంటి వారితోపాటు చార్లీచాప్లిన్ వంటివారు ‘సోషలిస్టు’ దృక్పథానికి దారి చూపిందని అంగీకరించారు.
‘మనవాళ్ళు ఉత్త వెధవాయ్‌లోయ్’ అనేది గిరీశం మాట. సాహితీకారుల విషయంలో.. వారి రచనలల్లోని ‘ఎజెండా’ను పాఠకుల తులనాత్మకంగా పరిశీలించి పాఠకులకందించటంలో తెలుగునాట పరిశోధన పట్టాలందు‘కొంటున్న’ పరిశోధకులు కాని... గొప్ప, గొప్ప సాహితీ విమర్శకులు కాని ఎందుకు ప్రయత్నించరు? ఇంగ్లీషు సాహిత్యపు ‘లోతుల్లోనే’ మనవారు మునిగి తేలుతుంటారు. కాళిదాసు కూడా కీట్స్‌ను అనుసరించాడని ‘గంట కట్టుకొని మరీ చెప్పే గొప్ప సాహితీ చారిత్రక పరిశోధకులు సహితం’ మనవారి గొప్పతనాన్ని అంగీకరించరు... ఇంకో విషాదం మరి. 1922 జులై 30న శ్రీకాకుళం కోఠీ వీధిలో రాచకొండ విశ్వనాథశాస్ర్తీగారు జన్మించారు. అమ్మ సీతాలక్ష్మి.. నాన్న నారాయణమూర్తి. అన్న మహాదేవశాస్ర్తీ, తమ్ముళ్ళు నరసింహాశర్మ, సుబ్బారావులు.. చెల్లెలు.. నిర్మల. వ్యక్తి జీవితాన్ని ‘స్వయంగా నిర్మించుకొన్నవారు’ తక్కువ. ‘సమాజ ప్రభావంలో.. దాని బాగోగులను అవగాహన చేసుకుంటూ.. తనకంటూ కొన్ని త్యాగాలను ముందే నిర్దేశించుకొని.. జీవితాన్ని తీర్చిదిద్దుకొన్న వారు అరుదైన వ్యక్తులుగా చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలను ఏర్పాటుచేసుకుంటారు.. - రా.వి.శాస్ర్తీగారి గురించి సాహితీకారులు చెప్పిన మాటలివి. శాస్ర్తీగారిని ప్రభావితం చేసిన అంశాలు, రెండు ప్రపంచ యుద్ధాలు.. పేదరికం.. ‘మానవ ప్రవృత్తిలోని స్వార్థపుటంచే రాజ్యస్వభావమై పాలకవర్గాల రూపంలో ప్రకటితమై బలోపేతమవుతుండటం’ స్వార్థం నిస్సిగ్గుగానూ, త్యాగం స్థైర్యంలోనూ ఉన్న దశ. వీటి పునాదులపైనే ఆయన స్వభావం.. సాహిత్యం ఏర్పడింది. ప్రతి రచయిత తనకంటూ ఓ ముద్రను సృష్టించుకుంటాడు (ఉండాలి కూడా). ఆ ‘ముద్ర’ వెనుక ‘నేపథ్యం’కూడా అవసరమే. అబ్బూరి వరదరాజేశ్వరరావుగారి స్నేహం శాస్ర్తీగారిని సీరియస్ రచనల సృజన వైపుగా పయనింపజేసింది.
ప్రపంచ సాహిత్యపు సాహితీమూర్తుల ‘అజెండా’లను ఓ ‘విషయ సూచిక’ సామాన్యంగా ఉంటుందనిపిస్తుంది. పాత కాలపు రచయితల ‘మానిఫెస్టోలు అర్ధంతరంగా ఆగిన వేళ ‘వాటి కొనసాగింపు’ ఇతర భాషా సాహితీకారులు అందుకుంటారు. మదింపుచేస్తూ ముందుకు తీసుకువెళతారు. ఇందుకు కారణం... ప్రపంచమంతా నియబద్ధమైన దోపిడి, పీడన, భౌతికంగా దౌర్జన్యాలు.. ఇందుకోసం ‘వ్యక్తులు’ ఏర్పరుచుకొన్న ప్రయివేటు సైన్యాలు (’సొమ్ములు పోనాయండి’ ఓ ఉదాహరణ) వారికి కొమ్ముకాసే పోలీసులు, ఆయుధాలు, తూటాలు. కూలీలను గుప్పిట్లో పెట్టుకొనే ‘డబ్బు’వంటివి. అంతేకాదు.. తరాలు మారినా, బానిసల చేతులకు వేసిన గొలుసుల మరో కొన ‘్భస్వాముల’ చేతుల్లోనే ఉన్నాయి.. ఉంటాయి. తరచి చూస్తే.. వర్తమాన ప్రజాస్వామ్య యుగపు ‘రాజ్య’లక్షణం ఇంతకన్నా గొప్పగా ఉందా? కవులను, కళాకారులను ప్రభావితంచేసే అంశాలు ఇవే. అయితే వీటిలో ‘తనను తాను’ నిరూపించుకోవాలనుకొనేవారు.. రచయితలు ఎన్ని త్యాగాలకైనా సిద్ధంకావాలి.. పేదల తరఫున మాట్లాడిన వారిని చరిత్ర చిత్రహింసలు పెడుతుంది. అవమానాలకు, కష్టాలకు గురిచేస్తుంది. రా.వి.శాస్ర్తీగారు కూడా ఈ కోవకే చెందుతారు. పతితుల గురించి, పీడితుల గురించి, దగాపడిన తమ్ముళ్ళు, చెల్లెలు గురించి (ఆరు సారా కథలు).. వారి ‘ఆకలిలోని నిజాయితిని.. నిజాయితీ వలన కలిగిన ఆవేదనాయుత ఆకలిని’ ఆర్తిగా రాసారు. ఆవేశంగా ప్రశ్నించారు. రా.వి.శాస్ర్తీ ఓ మంచి రచయిత. కారణం.. ‘మంచి రచయితలు లోకం కోరింది రాయలేదు.. వారు రాసిందే లోకం చదివింది.’ పాఠకుల అభిరుచికి, రచయిత చెప్పదలుచుకున్న సందేశానికీ నిరంతరం జరిగే పోరాటమే సాహిత్య చరిత్ర. ఒకర్ని నమ్మించడానికి ఆయన రచనలు చేయలేదు.. కొంతమంది రచయితలు ‘ప్రపంచం ఇలానే ఉంది.. ఉంటుందనే’ చట్రంలో ఉంటారు. కాని.. శాస్ర్తీగారు ‘ప్రపంచం ఇలా ఉంది.. కాని.. ఇలా ఉండకూడదు’ అని చెబుతూనే ఎలా ఉండాలో చెబుతారు (ఆరు సారాకథలు). రా.వి.శాస్ర్తీ కథలు, ‘మూడు కథల బంగారు’ ‘సొమ్ములు పోనాయండి’, ‘రత్తాలు రాంబాబు’వంటి వాటిని ఒక్కసారి తిరగేస్తే ఈ విషయం స్పష్టంగా అవగతమవుతుంది. ‘కన్నీరు కార్చటానికి పేదలు బాగానే ఉంటారు, తిరగబడితే వాళ్ళే విప్లవకారులవుతారు’.. విప్లవాల పుట్టుకకు ఓ నిఖార్సయిన వ్యాఖ్యానం (సింక్లేర్ మ్యానిఫెస్టో) రావిశాస్ర్తీగారి రచనలకు ముఖ్యమైన నేపథ్యం - ఆయన అన్ని రచనలకు ఏక వాక్య వ్యాఖ్యానం.
చివరగా.. అప్టిన్ సింక్లేర్ మ్యానిఫెస్టోలోని అంశాలు... రా.వి.శాస్ర్తీగారి రచనలోని.. ఆయన భావాల్లోనూ కనిపిస్తున్నాయనిపిస్తుంది. ‘పతితుల గురించి, పీడితుల, దగాపడిన తమ్ముళ్ళ గురించి రాస్తాను. వారే నా నిజాయితీకి సాక్షులు.. చరిత్రలో పేదల తరపునే పోరాడి.. ఆ దిశగా ప్రయోగించిన వారినిగూర్చి కూడా రాస్తాను’ అంటాడు సింక్లేర్.. మానవ ప్రవృత్తిలోని స్వార్థపుటంశ.. వెర్రివేషాలు వేయకుండా వ్యక్తి తనను తాను రక్షించుకోవాలి. అందుకోసం జాతిని రక్షించుకోవాలి. నలుగురిని కలుపుకు పోవాలి. అవసరమైతే తన బాగును పణంగా పెట్టాలి. ఈ పునాదిపై వ్యక్తుల తాత్వికత పాలిత, పీడిత జనానీకంతో సంబంధం పెంచుకొని వారిని పాలక వర్గాలకు అభిముఖంగా సమీకృతం చేయాలి.. రా.వి.శాస్ర్తీగారి రచనలలోని ‘మూల అంశాల మాల’ ఇదే. సింక్లేర్ సాహితీ నేపథ్యపు సిగ్నేచర్‌కు.. రా.వి.శాస్ర్తీగారి రచనలు కొనసాగింపు అనుకొంటా.. ఈ దిశగా పరిశోధకులు ‘కొంచెం సీరియస్‌గా’ ఆలోచిస్తే...!?

- భమిడిపాటి గౌరీశంకర్, 9492858395