సాహితి

శ్వాసించు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూవు నేల రాలినప్పుడు
పరిమళం గాయపడటం చూశావా!

కాల్లో విరిగిన తుమ్మ ముల్లు
సలపరించడాన్ని భరించావా!

గాలి కూడా వౌనంగా
మనసుల్ని దాటిపోవడం విన్నావా!

కొడవలిని చూసి ఉలిక్కిపడ్డ
కంకి బెదురు చూపులు కన్నావా!

శిథిలమైన దుఃఖపు శిలాజాల
కాలాన్ని గుర్తించగలిగావా!

దిగులు బరువుతో
మనశ్శయ్య కుంగడం గమనించావా!

వౌనాన్ని వీడే క్షణం కోసం
వేచిన సందర్భంలోని సాంద్రతలో మునిగావా!
తనపై వున్న ఆకాశాన్ని
హఠాత్తుగా కోల్పోయిన భూమి బాధను మోశావా!

లేదు కదూ..
కనీసం ఇప్పుడైనా జీవించు
జీవితాన్ని శ్వాసించు..

- కళ్యాణదుర్గం స్వర్ణలత, 9848626114