సాహితి

గొడుగులు నాటండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె గొడుగు కోసుకురమ్మంది
అవును మరి
అది ప్రణయ రుతువులో విచ్చుకునే పువ్వు
పై చినుకులేవీ మీద పడకుండా
లోపల కురిసే చినుకుల్ని మాత్రమే
మనకు వినిపించే వేణువు

కుండీలో గొడుగు పెట్టుకు రమ్మంది తను
నిజమే.. ప్రేమ రుతువులో గొడుగు
మబ్బుల ఆకులు తొడుక్కుని
చేతి వేర్లలోంచి మొలిచే నింగి మొక్క
తెరిస్తే రాగం.. ముడిస్తే రాగం
గొడుగు అరచేతిలో హార్మోనియం
ఆమె గొడుగు మోసుకురమ్మంది
గొడుగుల్లాంటి దుకాణాల కింద రోజంతా
నన్ను నేను ముడుస్తూ తెరుస్తూ కూర్చున్నాను
ఎవరెవరో ఎవరెవరో
ఎవరికింద ఎవరు నిల్చున్నామో
రెక్కలు తొడుక్కుని ఒక గొడుగేదో ఎగిరిపోతున్నట్టు
నీటి ధారల ఊచలతో ఆకాశం నిండుగా నవ్వింది

వీధుల్లో పోతుంటే చిల్లులు పడ్డ గొడుగుల్లా గుడిసెలు
ఈ నాయకులకు చెప్పాలి
కాస్త ఆ పథకాల ప్రచారాలు ఆపి
గుడిసె గుడిసెకీ ముందు గొడుగుల్ని నాటమని.

అయ్యో బయటో లోపలో భోరున వర్షం
త్వరగా ఇంటికి వెళ్లాలి
నన్ను గొడుగుగా విప్పుకుని ఆమె కప్పుకుంటుంది

- ప్రసాదమూర్తి, 8499866699