సాహితి

కృష్ణ బిలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నువ్వంటే ప్రేమ నాకు
ఆత్మ ప్రతీ ఒక్కరి ప్రాణంలా...
సున్నితమైన హృదయాన్ని సురక్షిత స్థానంలో పదిలపరిచినట్టు!
శీతాకాలం మంచులో నువ్వొణుకుతుంటే
వేసవిలో నువ్వు మండుతుంటే
విలువైన రత్నాన్ని బంగారంలో పొదిగినట్టు
నిన్ను నా రెక్కల్లో దాచేసాను
అప్పుడెప్పుడో మనమెరుగని గత శతాబ్దాలలో
మా తాతల ముత్తాతలు
మీ ముత్తాతల తాతలనేమన్నారో గాని
ఒక్కమాటే ఇంకో చెవిలో పడేముందు
రంగులు మారిపోయే రోజుల్లో
ఏది సత్యం? ఏది అసత్యం?
ఫక్కున నవ్వుతున్నాననుకోకు గాని
అప్పటి కథలు విని
ఇప్పుడు నీకొచ్చిన కలలో
నేను నిన్ను కొట్టాననడం విడ్డూరం కదా?
ప్రేమని సందేహంలో ముంచి
ఋజువడుగుతున్నావు తరచి చూడు.
ఏ వస్తువైనా ప్రేమతో దరిజేర్చుకుంటే సజీవమైపోతుంది
తొలగిస్తే ప్రజ కూడా వస్తువుల్లా మారిపోతారు
ఇల్లున్నా బడి ఉన్నా ఇంకెన్నో ఉన్నా
ప్రేరణలో ఉత్సాహం లోపించినట్టు
యంత్రం లాంటి వాళ్ళు మీట నొక్కితే భగ్గుమంటారు
లోకాన్ని సొంతమనుకుంటే
పట్టు తప్పిన ప్రతి క్షణంలో నువ్వే మనోబలం!
పసిపిల్లలకి విద్య నేర్పిస్తున్నప్పుడు
కుల మతాల వైషమ్యాలు నూరిపోస్తామా?
మానవతా విలువల్ని కదా చాటి చెప్పేది?
లేని సమస్యల్ని నీ గుర్తింపు కోసం సృష్టించుకో..
కాలం కలిసొచ్చి విరోధి స్నేహితుడౌతాడని
వెనె్నలంత నమ్మకం నాకు
జనన మరణాల్లా
అలల కృష్ణబిలాల రహస్యాలు వీడనట్లు
ప్రతి అనుభవం సంపూర్ణతే... శూన్యంలా!

- బులుసు సరోజినీదేవి, 9866190548