సాహితి

వెలుగుబాటల విస్తృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకు స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాల కాలం గడిచింది. భారతీయ సమాజంలో అనేకమైన మార్పులు సంభవించాయి. సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో ఇట్లా ఏ రంగాన్ని తీసుకున్నా మార్పులు కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. సహజంగా ఈ నేలమీద సృజింపబడ్డ సాహిత్యంపై కూడా ఆ మార్పుల ప్రభావాలు స్పష్టంగా కన్పిస్తూనే ఉన్నాయి. భాష ఏదైనా కావచ్చు, కానీ భాషా సాహిత్యాలపై వీటి ప్రభావాలు బలంగానే కన్పిస్తాయి. ముఖ్యంగా మానవ సంబంధాల విషయంలో పెనుమార్పులు సంభవించడం ప్రారంభమైనప్పటినుండి సాహిత్యం వేగవంతమైన మార్పులకు వేదికైంది.
అన్ని భాషల్లోని సాహిత్యాల్లాగే తెలుగు సాహిత్యం కూడా ఈ డెబ్భై ఏళ్ళల్లో లెక్కలేనన్ని మార్పులకు చోటిచ్చి అనేక సాహిత్య ఉద్యమాలకు కుదురుగా నిలిచింది. మార్పు అనివార్యం అన్న విషయాన్ని సాహిత్య పరిణామం తెలిసిన ప్రతి వ్యక్తికి తెలుసు. మానవ సమాజంలోని మార్పులన్నీ సాహిత్య రంగంలో చోటుచేసుకుంటాయన్న సత్యం కూడా తెలుగు సాహిత్యం నిరూపించింది. ఆంగ్లేయ విద్యా విధానం కారణంగా తెలుగు సాహితీప్రియులకు, సాహితీవేత్తలకు ప్రపంచ సాహిత్యం పరిచయం కలిగింది. విశ్వ సాహిత్య వేదికపై వచ్చిన వివిధ మార్పులు మూలాలు తెలుగు సాహితీ ప్రపంచానికి బోధపడిన కారణంగా రొమాంటిసిజం, డాడాయిజం, సర్రియలిజం వంటి అనేక పరిణామాలు సంభవించాయి. క్రమంగా అవి ప్రత్యేక సాహిత్య ఉద్యమాలకు మూలాలై నిలిచాయి. అవధానాలు రాజస్థానాలకే పరిమితం కాకుండా క్రమంగా ప్రజల్లోకి నడిచి వచ్చాయి. తాలోత్తాలంగా ఎగిసిన భావ కవిత్వోద్యమం క్రమంగా అభ్యుదయ కవిత్వోద్యమంగా రూపొంది నిలిచింది. స్వాతంత్య్రం వచ్చేనాటికి తెలుగు సాహిత్యాకాశాన చెరిగిపోని తారలుగా నిలిచిన రచయితలైన తిరుపతి కవులు, దేవులపల్లి, గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ, సురవరం ప్రతాపరెడ్డి, జాషువా, విశ్వనాథ వంటి మహనీయులు సాహిత్య సృష్టిని విస్తృత రీతిలో వారి వారి భావాలకనుగుణంగా అందిస్తూ వచ్చారు. తెలుగు సాహిత్యంలో నవ్య సంప్రదాయవాదం, అభ్యుదయవాదం వంటివి వేలాదిమంది రచయితలను, కవులను సాహితీ ప్రపంచానికి అందించింది. సాహిత్య ప్రక్రియావైవిధ్యం కూడా దీనికి తోడ్పడడం విశేషం. కవిత్వం, కథ, నవల, విమర్శ, నాటకం వంటి రంగాల్లో రచయితల విస్తృతి పెరిగింది. పలు రీతుల్లో అభివ్యక్తి కూడా ప్రస్ఫుటంగా వ్యక్తీకరించబడింది. ఆ కారణంగానే కవిత్వాలు ఎంతగా వచ్చాయో కథలు, నవలలు, నాటకాలు విస్తృతంగా రావడం ఒక విశేషం. సాహిత్య విమర్శ కూడా సమాంతరంగా ఎదిగింది. పత్రికారంగ విస్తృతి కారణంగా సాహిత్య పరిధి పెరిగింది. శ్రవ్య దృశ్య మాథ్యమాలు ఈ పరిధిని మరింత పెంచాయి. లబ్ధప్రతిష్ఠులైన కవులు, రచయితలు మొదలుకొని వర్ధమాన రచయితలవరకు ఇవన్నీ సంపూర్ణంగా తోడ్పడ్డాయి. ఈ డెబ్భై ఏళ్ళకాలంలో లెక్కపెట్టలేనంతగా సాహిత్యం పెరిగింది.
ఇదంతా ఒక పార్శ్వం, రెండో వైపు చూస్తే అనేకానేక లోపాలూ దర్శనమిస్తాయి. యువతరాన్ని తప్పుదారి పట్టించే సాహిత్యం, మానవ విలువల్ని మంటగల్పి రెచ్చగొట్టే కథనాలు, మనుషుల బలహీనతల మీద, మార్కెట్టే ధ్యేయంగా పుట్టుకొచ్చిన రచనలు కూడా కొల్లలుగానే వచ్చాయి. వాటి నుండి తననుతాను రక్షించుకోడానికి మనిషి చెయ్యాల్సిన ప్రయత్నాలు మాత్రం సాహిత్య రంగంలో నిలదొక్కుకున్నాయి. అందుకే ఉత్తమ సాహిత్య సృష్టి నిలిచింది. తెలుగు రచయితల్ని జ్ఞాన పీఠాలపై ఎక్కించింది, సాహిత్య అకాడెమీ పురస్కారాలను తెచ్చి పెట్టింది.
దిగంబర కవులు, చేతనావర్త కవులు, విప్లవ రచయితలు తమతమ ఆలోచనా కేంద్రాల్లోంచి మనిషిని అధ్యయనం చేసి సాహిత్యాన్ని విస్తృతపరిచే యత్నం చెయ్యడం రుూ యేడు దశాబ్దాల్లో జరిగిన గొప్ప పరిణామం. కవిసేన మేనిఫెస్టో వంటి ఆలోచనా ధారలు కూడా దీనికి తోడయ్యాయి.
అస్తిత్వం మనిషికి మొదటి కర్తవ్యం కావడం స్వాతంత్య్ర ఫలమే. కాబట్టే దళిత, బహుజన, మైనారిటీ సాహిత్య విస్తృతి పెరిగింది. స్ర్తివాద ఉద్యమాలతోబాటు పలు ఇతర ఉద్యమాల ప్రతిఫలనాలవల్ల కూడా సాహిత్యం గొప్ప మలుపులు తిరిగింది. యావత్ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారత స్వాతంత్రోద్యమం, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాల స్ఫూర్తి కొత్త సాహిత్యాన్ని లోకంలోకి ప్రవహింపచేసే బాధ్యత తీసుకోవడం గొప్ప విజయంగా భావించవచ్చు. ఆ కారణంగా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రోద్యమం సృష్టించిన సాహిత్యం ప్రజల్లోని ఆకాంక్షలకు మరో రూపంగా విశాలమైన సాహిత్యం బయటికొచ్చింది. పాటకు పట్టంకట్టి తన విజయకేతనాన్ని సాహిత్యం ఎగురవేసింది. దాశరథి, సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, సోమసుందర్, తిలక్, శేషేంద్ర, నాయని, వేదుల, తుమ్మల, వీరేశలింగం, చిలకమర్తి, బుచ్చిబాబు, పల్లాదుర్గయ్య వంటి అప్పటి తరం కవుల్లాగానే తదనంతరం వచ్చిన సుప్రసన్న, జగన్నాథం, సంపత్కుమార. వే.న.రెడ్డి, మాదిరాజు రంగారావు, వరవరరావు, మధురాంతకం, కొలకలూరి ఇనాక్ వంటివారి తరం కూడా విస్తృత సాహిత్య సృష్టి చేసింది.
అంపశయ్య నవీన్, గడియారం రామకృష్ణశర్మ, సామల సదాశివ, ఆచార్య ఎన్.గోపి వంటి పెద్దల సాహిత్య సృష్టి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాలను అందించి తెలుగు వెలుగును పెంచింది. అద్దేపల్లి, దర్భశయనం, బన్న అయిలయ్య, రామాచంద్రవౌళి, పొట్లపల్లి, పాపినేని శివశంకర్ వంటి పలువురు అత్యాధునిక రచయితలు, కవులు తెలుగు సాహిత్య ప్రగతికి కొత్త బాటలు వేస్తున్నారు.
కథ మీద నిరంతర పరిశోధనలు చేస్తున్నవారు కొందరైతే, కవిత్వాన్ని విస్తృతపరచే పనిలో మరికొందరు, నాటకాన్ని రంగస్థలంపై నిలబెడుతున్నవారు ఒకవైపు ఉంటే, విమర్శకు గుడికట్టే పనిలో మరికొందరు... పెద్దలు, పత్రికా రంగంలో ప్రపంచాన్ని ప్రదర్శింపజేస్తున్న మేధావులు ఒక మార్గంలో నడిస్తే వివిధ ప్రక్రియల ద్వారా తెలుగు సాహిత్యపు మార్గాల్ని విస్తృత పరచాలన్న తీవ్ర ప్రయత్నాల్లో ఇంకొందరు- ఇట్లా రుూ డెబ్భై యేళ్ళలో తెలుగు సాహిత్యం చూపిన, చూపించబోతున్న వెలుగుబాటల విస్తృతిని ఒకసారి సింహావలోకనం చేసుకున్నప్పుడు మన ఆలోచనల్లో ఒకానొక కొత్త చైతన్యం వెల్లివిరువక మానదు.

- గన్నమరాజు గిరిజామనోహరబాబు 9949013448