సాహితి

ఏడు పదుల జెండాకు వందనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వతంత్య్ర స్వేచ్ఛా భారతావనికి
సప్తతి మహోత్సవం
రెండు దశాబ్దాల దాస్య శృంఖలాలు
ఛేదించిన సుదినం
విజయమో వీర మరణమో
జైహింద్ అంటూ తెగించిన నినాదం ‘వందేమాతరం’

రెట్టించిన ప్రజాబలం ఒక్కటిగా
పూరించిన సమర శంఖారావం
రెపరెపలాడుతున్న మువ్వనె్నల పతాకకు పునాదిగానం
అప్పుడు ఈ దేశం మనది.. జాతి మనది..
మనమంతా భారతీయులం

గతం మరచి మనలో మనమే గోముఖవ్యాఘ్రాలమై సంచరిస్తున్న కొందరం
సృష్టి సమస్తాన్ని కబళిస్తూ పచ్చని భూమాతకు శిరోభారమవుతున్నాం
మునుపటి రోమాంచిత స్ఫూర్తిని మళ్లీ మనలో నింపుకుందాం
భరతమాత స్వప్నించిన ఈ నేల తల్లి బిడ్డలుగా సమభావంతో జీవిద్దాం
అంతరాలు వీడి మనుషులంతా ఒక్కటేనని విశ్వనరులమై సాగుదాం
ఇప్పుడు ఈ దేశం మనది జాతి మనది మనమంతా భారతీయులం

- పొట్లపల్లి శ్రీనివాసరావు 9849254078