సాహితి

కవితాదర్భశయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వం 2015
సంపాదకులు:
దర్భశయనం శ్రీనివాసాచార్య
ప్రచురణ: కవన కుటీరం
వరంగల్- తెలంగాణ
వెల:రూ.80/-
ప్రతులకు:
నవోదయ, విశాలాంధ్ర,
నవ చేతన బుక్‌హౌస్
***
‘‘కొన్నివేల కవితల్లోంచి’’ ఓ అరవై కవితల్ని ఏరటం, అందునా 1. సామాజిక దృక్కోణంనుంచి 2.ఆత్మగతానుభవాన్నించి 3. మానవ సంబంధాలనుంచి 4. జీవన తాత్త్విక (తాత్విక కాదు) సారాంశం నుంచి 5. సౌందర్య చింతనలోంచి 6. ఉద్యమాల నేపథ్యంలోంచి 7. ప్రకృతిని కవితా ప్రాంగణంలోకి విచ్చిననాటినుంచి’’ వచ్చిన కవిత్వాన్నించి ఉత్తమమైన కవితల్ని వింగడించటం సామాన్యునివల్ల అయ్యే పనికాదు. ఒంటిచేత్తో ఇంతటి ఘనకార్యాన్ని నిర్వహించటం దర్భశయనం శ్రీనివాసాచార్యకే చెల్లింది. పుస్తకం ఆకర్షణీయంగా తయారవటానికి రమణజీవి- బృందావనం బ్రహ్మంగారలు తీసుకున్న శ్రద్ధ బహుధా శ్లాఘనీయం. ఈ అరవై కవితల సందర్భ, స్వరూప, స్వభావ వివరాలను సంక్షిప్తంగా సంపాదకీయంలో దర్భశయనం వారు సెలవిచ్చారు. వ్రాసిన వారిలో ముగ్గురు ఇహలోక యాత్రను ముగించారు. వారికి నివాళినర్పించారు. ‘‘2015 సంవత్సరానికి సంబంధించిన సర్వ సమగ్ర కవితా సంకలనం’’గా సంపాదకులవారు భావించకపోయినా ‘‘శ్రద్ధతో- ధ్యాసతో కొన్ని నిర్దిష్ట ప్రాతిపదికలపైనే ఈ అరవై కవితల్ని ఎంచుకు’’న్నట్లు చెప్పటమే వారి నిజాయతి. ఇందులో మరొక నిజాయతి కూడా కలదు. వారు పూర్వోత్తర దశాక్రమాన్ని ఇలా చెప్పారు. ‘‘ఒక మాట చెప్పక తప్పదు. ఈ సంకలనాన్ని రూపుదిద్దే క్రమంలో వేల కవితల్ని అధ్యయనం చేసి ఒక మంచి చదువరినైనాను’’. కొన్నివేల కవితలు అధ్యయనం చేసిన చదువరి ఎంపిక చేసిన అనర్ఘరత్నాల్లాంటి అరవై కవితలు ఎలా వుండాలో అలానే వున్నాయి. ప్రత్యేకించి ఒక్కొక్క కవితను- రచయితను ఉటంకిస్తూ సమీక్షా పరిచయంగాని, పరిచయ సమీక్షగాని చేయవలసిన గరుజు లేదు. కొందరి పేర్లు నాకు తెలియదు. ఇప్పుడు ఈ సంకలనం ద్వారా వారి కవిత్వం చదివే అవకాశం కలిగింది. పద సంపదయున్నూ తెలిసింది.
‘‘నీలిమేఘాలు’’లో వుండదగిన రచ న ఈ సంపుటిలో చోటుదక్కించుకోవ టం పౌరుషమే. సంపాదకుల సమదృష్టికి తార్కాణం. కొందరు ప్రసిద్ధుల పే ర్లు కనిపించకపోవటానికి కారణం వా రు సంపాదకుల అధ్యయనానికి నోచుకోగల స్థాయిగల కవిత్వం వ్రాయకపోవటమై యుండవచ్చు. లేదా ఒంటరి సంపాదకత్వంలోని నిక్కుపాటు కావ చ్చు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘‘2015వ సంవత్సరంలో అచ్చయిన కవితల్లోంచి నాకు విశిష్టంగా కనపడిన అరవై కవితల్ని ఎంచుకుని ఈ ‘కవిత్వం 2015’ సంకలనాన్ని తీసుకొస్తున్నాను’’. ఇదీ ఒంటరి సంపాదకత్వంలోని జడ్డ. ఈ విశిష్ట కవిత్వం తెలుగు ప్రాదేశికమైనదైనా అర్థసంపత్తికి వైదేశికమే. కనుక వారన్నట్లు ‘‘రానున్న సంవత్సరాల్లో కవిత్వ సంకలనాల్ని మరింత అర్థవంతంగా రూపొందించడానికి..’’ వీలుంది. సంవత్సర జ్ఞాపికగా తెలుగు ప్రతివాడు దాచుకోవాల్సిన పుస్తకం ‘కవిత్వం 2015’.

- సాంధ్యశ్రీ