సాహితి

మర్రి నీడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటి యజమాని ఆదుర్దాగా వున్నాడు.
వాకిట్లో పచార్లు చేస్తున్నాడు
ఇంటి కుడివైపు గోడమీద మర్రి చెట్టు మొలిచింది
ఆకుల చేతుల్ని అల్లల్లాడిస్తూ గాలికి విలాసంగా ఊగుతోంది
మర్రి మొక్కను పీకగూడదన్నారు
కనీసం విరవగూడదన్నారు
ఎందుకంటే అది ధర్మవిరుద్ధం గనుక!

ఇంటి యజమాని ఆదుర్దాగా ఉన్నాడు
వాకిట్లో పచార్లు చేస్తున్నాడు
చెట్టుకు పూజలు చేసే జనం గుమిగూడుతున్నారు
ఇల్లు సార్వజనీకమైన స్థలమైంది
ఇంటి యజమాని ఏమీ అనకుండా ఉన్నాడు
అతడు ఎవరినీ అడ్డుకోవడంలేదు
ఎందుకంటే అది ధర్మవిరుద్ధం గనుక!

ఇంటి యజమాని ఆదుర్దాగా ఉన్నాడు
వాకిట్లో పచార్లు చేస్తున్నాడు
చెట్టు వేళ్లు గోడల్ని తనే్నస్తున్నాయ్
ఊడలు ఇంట్లో దిగబడ్డాయ్
ఇల్లు బహిరంగ స్థలమైంది
ఊరువాడా ఒక్కటై జనం బారులు తీర్చారు
ఎవరినీ ఏమని లాభం లేదు
ఎందుకంటే అది ధర్మ విరుద్ధం గనుక!
ఇంటి యజమాని ఆదుర్దాగా ఉన్నాడు
వాకిట్లో పచార్లు చేస్తున్నాడు
చెట్టు విశ్వరూపం ప్రదర్శిస్తోంది
ఇల్లు అనవసరంగా నలిగిపోతోంది
మర్రి చెట్టు ఇంటిని తొక్కేసినా
యజమాని ఏమీ అనలేకపోతున్నాడు
లోలోపల కుమిలిపోతున్నాడు
చివరకు ‘నీ...యవ్వా!’ అని ఎక్కడో
అంతరాంతరాల్లో అనుకున్నాడు
అంతకుమించి ఏమైనా అనుకుంటే, అంటే
నోరు కదిపితే-అది ధర్మ విరుద్ధవౌతుంది గనుక!
**

హిందీ మూలం: రాజేష్ జోషి
అనువాదం: దేవరాజు మహరాజు