సాహితి

ఒంటరితనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడేళ్లుగా ఒంటరితనం అలవాటైంది
ఎన్నడూ లేని కొత్త అనుభూతి పరిచయమైంది
పాతికేళ్లు నేను కోల్పోయిందేమిటో అర్థమైంది
సంధ్యారాగపు సాయం సమయాలు..
ఉషోదయంలో ఉషాకిరణాలు..
ఒంటరి నడకల సుదూర ప్రయాణాలు..
కొత్తగా అనిపించాయ్..
నాలో నేను మాట్లాడుకోవడం..
నాతో నేను పోట్లాడుకోవడం..
సరికొత్తగా కన్పించాయ్..
నాతో నేను గడిపిన సమయాలు..
నేనేంటో గుర్తుచేశాయ్
నాలో నేను మాట్లాడిన క్షణాలు..
నాలో మరో మనిషిని నిద్రలేపాయ్
అప్పుడేమో..
బంధాలు బంధుత్వాలు..
బరువు, బాధ్యతలనే మిగిల్చాయ్
ప్రేమలు స్నేహాలు..
కష్టాలు, కన్నీళ్లకు కారణమయ్యాయ్
ఇప్పుడేమో
శాసించేవాళ్లు లేరు..
నా నుంచి ఆశించే వాళ్లూ లేరు..
ఏడ్చేవాళ్లు లేరు..
నన్ను ఏడిపించే వాళ్లూ లేరు..
అందుకే...
ఎవరూ లేకపోవడం భారం కాదు
భాగ్యమనిపిస్తోంది!
ఎవరూ రాకపోవడం ఒంటరితనం కాదు
వరమనిపిస్తోంది!
అందుకే ఇదేదో బాగుంది..
భలేగా ఉంది!

- సంతోష్ ముద్దన, 7801096776