సాహితి

18న లక్ష్మణ చక్రవర్తికి సహృదయ సాహితీ పురస్కార ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒద్దిరాజు సోదర కవుల స్మృత్యంకంగా వరంగల్లులోని సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ అందిస్తున్న సహృదయ సాహితీ పురస్కారం 2016 సంవత్సరానికి గాను ప్రసిద్ధ విమర్శకులు డా. లక్ష్మణ చక్రవర్తి రచించిన ‘ప్రతిబింబం’ సాహిత్య విమర్శ గ్రంథం ఎంపికైంది. లక్ష్మణ చక్రవర్తి తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 18న జరిగే సహృదయ 20వ వార్షికోత్సవం రోజున లక్ష్మణ చక్రవర్తిని జ్ఞాపికతో పాటు రూ.10,000ల బహుమతితో సత్కరించనున్నట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి గన్నమరాజు గిరిజా మనోహర్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పురస్కారం ఇప్పటివరకు డా. కేశవరెడ్డి, మునిపల్లెరాజు, డా. ఎ.జయప్రభ, ఆచార్య ఎస్.వి.రామారావు, డా. గరికిపాటి నరసింహారావు, ఆచార్య అనుమాండ్ల భూమయ్య, ఆచార్య ఎండ్లూరి సుధాకర్, అల్లంరాజు శేషగిరిరావు, దర్భశయనం శ్రీనివాసాచార్య, రామాచంద్రవౌళి, డా. నాళేశ్వరం శంకరం, గొల్లపూడి మారుతిరావు, కె.వరలక్ష్మి, ఆచార్య బన్న అయలయ్య, కాలువ మల్లయ్య వంటి ప్రముఖులు అందుకున్నారు.