సాహితి

ఆలోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలోచనకు రూపు లేకపోవచ్చు
మనిషిని కాలాంతరాల్లోకి తీసుకెళ్ళగలిగే
నిర్దుష్టమైన చూపు అది.
ఆ దృష్టి ప్రసరణ సాగినంత మేర
నూతనత్వం మట్టి పరిమళాల్ని వెదజల్లుతుంది.
ఆలోచన తొలకరి చినుకై కురిసి
మస్తిష్కం పొలాన్ని సుసంపన్నం చేసే
జలధారౌతుంది.
అది చీకటి చీల్చుకొచ్చే
మిణుగురు కాంతిలా పుట్టి
ఇంద్రధనుస్సులోని వర్ణాల్లా
బహుముఖాలుగా విక్రమిస్తుంది.
ఆలోచించడమంటే
కాలక్షేపానికి దిక్కులు చూడ్డం కాదు.
ఆలోచన గీటురాయితో
మెదడు కత్తి కొనలకి పదును పెట్టుకోవడం.
ఆకుల్లో పచ్చదనం పరిమళించినంత సరళంగా
జీవన చిత్రానికి రంగులద్దగల
వినూత్న సృజన ఆలోచన.
ఫౌంటేన్‌లో నీళ్ళలా
అక్కడక్కడే తిరిగే ఆలోచనకి సార్ధక్యత వుండదు.
అది విస్తృతమై వుండాలి.
విశ్వజన శ్రేయానికి కారకమవ్వాలి
అగ్నిపర్వతం నుండి లావా కారుతున్నట్లుగా
మెదడు కుదుళ్ళనుండి
ఆలోచనల తీగలు సాగుతాయి.
కాలం గడిచేకొద్దీ లావా బూడిదగా మారుతుంది.
ఆచరణకు నోచుకోకపోతే ఆలోచనైనా అంతే.

- జి.రామచంద్రరావు, 8985894114