సాహితి

ఇప్పుడు ఏమయ్యాయ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ్‌ముఖ్ జమీందార్ల
దోపిడీతనాన్ని
పొలిమేరలు దాటేలా
తరిమి తరిమి కొట్టిన
వొడిసెలు పట్టిన చేతులు
ఇప్పుడు ఏమయ్యాయ?

రాచరికపు భూకామందుల
నిరంకుశ పోకడలను
తుపాకీ తూటాలను
గుండె నిబ్బరంతో
ఎదురొడ్డి నిలిచి
మృత్యువును ముద్దాడుతూ
ముందడుగు వేసిన
పోరాట పటిమలు
ఇప్పుడు ఏమయ్యాయ?

నియంతల దుశ్చర్యలను
పాలకుల పాపాలను
ప్రజలకు అందించడంలో
ప్రాణాలను తృణప్రాయంగా
త్యజించిన యోధుల కలాలు
ఇప్పుడు ఏమయ్యాయ?
అరవై వసంతాల ముందు
అక్షరముక్క నేర్వకున్నా
ప్రపంచానికే ఉద్యమ పాఠాలు
చెప్పిన చాకలి ఐలమ్మ ధీరత్వం
అరాచకాలకు గురయ్యే
అబలలకు, అభాగ్యులకు
ఆదర్శం కావాలి
ఆత్మరక్షణకు ప్రేరణనివ్వాలి

స్వరాజ్య సాధనకై
అమరత్వం పొందిన
దొడ్డి కొమురయ్య తెగింపు
ప్రపంచీకరణ విధ్వంసాలకు
కుదేలవుతున్న అన్నదాతలకు
పోరాడే ఆయుధమవ్వాలి

పత్రిక విలువలకై
తపించి పోరాడిన
షోయబుల్లాఖాన్ నిర్భయం
ప్రజాస్వామ్య ప్రగతికి
కృషించే పత్రికల కలాలకు
పవిత్ర ఇంధనమై
ప్రజను రాజుగా మార్చాలి.

- బైతి దుర్గయ్య, 9959007914