సాహితి

తెల్లకాగితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరువైనా
బరువైనా
నాకు తీరేది కాగితమీదే.
మబ్బులు ముసిరినత
మనసులాగ కాదు
హంసలు కప్పిన సరోవరంలా
వుంటుంది కాగితం.

కలంనుండి రాలుతున్న
అక్షరాలను ఎక్కడ దాచుకోవాలి!
జేబులో కుక్కితే
డబ్బు వాసన సోకి
అసలు అస్తిత్వాన్ని కోల్పోవచ్చు.
పిడికిట్లో బిగపడితే
వాటి వేడికి
చెయ్యి కాలిపోవచ్చు
కాగితమే శరణ్యం నాకు.

కాగితానికి
వేల అడుగుల
విస్తీర్ణం లేకపోవచ్చు.
కాని
బండెడు వాక్యాలు చల్లినా
గుండెల్లో దాచుకుంటుంది.
ముంబయిలోని
దస్ బై దస్ గదిలాగ
అనేక జీవితాలను
అఖండంగా వెలిగిస్తుంది.

రంగులన్నింటిలో
తెల్లదనమే నాకిష్టం
అది కాగితం రంగు కాబట్టి.
కాగితం నాకు
ప్రాణప్రదమైంది.
ఎందుకంటే
దానిపైనే నా భావనలకు
విముక్తి కాబట్టి.

- డా. ఎన్. గోపి