సాహితి

సంధ్యాం తర్పయామి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంధ్యనుపాసిస్తున్న
నన్ను
‘‘మసక నిశ్శబ్దం’’ చుట్టేసుకొంది
సూర్యుడావలించి అటు వెళ్తూ వెళ్తూ
ఎంత విషాద మోహనంగా చూశాడని
కలల పరిమళాన్ని మేలుకొలిపే
మంత్రనగరి పొలిమేర వైపు...

చుక్కలు మొలుస్తున్న నిష్క్రమణలో
పూర్వార్థం భాసిస్తుంది
ఆ అర్థంలోనే
వియోగం నిత్య నైమిత్తిక సూత్రాలల్లుతూ
క్షణక్షణ భవితవ్యాన్ని బహిర్గతం చేస్తూ వుంటుంది
కళ్ళు నెమరువేసే శబ్దోపాసనకు
నిశ్శబ్దపు దృశ్యమాలికలల్లుతూ...

కిరణ కిరీటాన్ని చేతులు మార్చుకుంటూ
ఆకాశంలోకి లేచే ఆ హిత వార్తికం
చెట్ల కొమ్మల్ని ఒరుసుకుంటూ
శిథిల చరిత్రని చెరుపుకుంటూ
వాతరథ ప్రయాణపు వలయ వంశార్ణవాన్నీదుతూ
ఉద్రేకపు బరువుని మోస్తున్న మానవ శబ్దాన్ని
మంజుల కింశుక ప్రియ మధూళిగా మారుస్తూ...

పువ్వు గొంతులో తేనె పాటని
కలువలు విచ్చిన కాసార వారిని చేస్తూ
ఇరులడుగు చప్పుళ్ళని
ఉదయ కుటీర ప్రాంగణ భవిగా ఉల్లేఖిస్తూ
పక్షి ఱెక్కల గుప్పిట్లోంచి రాత్రి బిగువును సడలించి
జీవం ఏ జీవంతో స్పందిస్తుందో
ఆ అనల ప్రవాహాన్ని ప్రతి రుతిస్తూ...

శబ్దాలంకారాలు రగిల్చే
నా హృదయాగ్ని పర్వతానికి
కర్తవ్యోపమని పదవీ గౌరవంగా తొడిగి
మట్టి చెక్కిన ఔదార్య శిల్పానికి
మానవత్వపు ఊపిరులందిస్తూ
సూర్య స్నానానికి ఆయత్తవౌతున్న
గొంతు జలపాతపు విహంగ ఖేలగా ఉద్యమిస్తూ
గాలికి సందేశాత్మక సౌజన్యమప్పగించి...

ఇదిగో...!
నాలోకి పోతున్న, నా ఊహా శబలతని మీటుతూ
రంగులు మింగుతున్న మంచుబొట్లు
ఎండలు వ్రేలాడుతున్న మండువా పంచలోకి
మిడుకు మానవతా లహరిలా చింది
నాదోసిట కుంకుమ నింపే ప్రత్యూష ధవళిమగా
జీవన తృష్ణలో కలిసిపోయాయి...

- సాంధ్యశ్రీ, 8106897404