సాహితి

కథా రచయిత పరిణామం (శ్రీవిరించియం 17)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథా రచయిత కూడా మొదటిలో కథా చదువరే. ఎక్కడో ఓ మంచి కథ చదివిన తరువాత అతనికి కూడా కథలు రాయాలనే సంకల్పం కలుగుతుంది. తనకు తెలిసిన జీవితాన్ని గురించి కథలు వ్రాస్తాడు. చదువరిగా అతనికి వున్న పరిణతిని ఆధారం చేసుకుని ప్రపంచ పోకడలు అర్థంచేసుకుంటాడు. కథలు రాయటానికి ఉబలాటం ఒక్కటే వుంటే చాలదు తెలుసుకుంటాడు. ప్రతి కథలోనూ యేదో సందేశం. స్పష్టంగానో సూచనగానో కనిపించాలి. బొత్తిగా ‘నీతి’కథలు కాకుండా జనవర్తనానికి అవసరం అయిన సంకేతం యేదో కనిపించాలి కథలో.
కథారచన ఒక ప్రసవ వేదన వంటిది అనే విషయం అతనికి క్రమంగా గుర్తుకువస్తుంది. ఎక్కడో యేదో ఆలోచన, వినిపించిన మాట, కనిపించిన ప్రకృతి అతనికి ఆలంబన యిస్తాయి. దానిని ఆధారంగా తీసుకుని వృత్తాంతం అంతా మనసులో గణించుకుంటాడు. మనస్సులో అది మెదులుతూ వుండగానే, యితర వ్యావృత్తులు వచ్చిపడుతూ వుంటాయి. వాటినన్నింటినీ సంబాళించుకుంటూ కథ రాయాలన్న ఆరాటాన్ని పెంచుకుంటూ వస్తాడు. మనసులో మాట కాగితం మీదికి దూకితేగాని తీరనంత ఆకలి, దప్పిక అతన్ని వేధిస్తాయి. అక్షరాలు కూర్చుకుంటూ వాక్యాలు పేనుకుంటూ మొదటి ప్రతి తయారుచేసుకుంటాడు. అందుకనే దీనిని కృత్యాద్యవస్త- లేకపోతే ప్రసవ వేదన- అంటారు.
కథ రాసేసిన తరువాత ఆ పేజీలు ఒక మూల పడేస్తాడు. పది రోజులపాటు అవి ముట్టుకోడు. వెంటనే పత్రికకు పంపివేయాలనే ఆతురత చూపడు. ప్రతి చదువరిలోను, రచయితలోను- సహజ ప్రకృతిగా ఒక విమర్శకుడు కూడా దాగి వుంటాడు. ఆ విమర్శకుడు అంతకుముందు వ్రాసిన కథ పేజీలు తిరగేసి, అది ఎవరిదో రచన అన్నట్లుగా చదువుతాడు. అక్షరాల పొందికలో తప్పులు దిద్దుతాడు. కథాగమనం సవ్యంగా వున్నదా లేదా అని పరీక్షపెట్టి చూచుకుంటాడు. తన అభిప్రాయాలు, చెప్పదలుచుకున్న విషయం సజావుగా సమకూరిందా లేదా అని ఒకటికి రెండుమార్లు సరిచూచుకుంటాడు. అప్పటికిగాని అతనికి ప్యాస్‌మార్కులు వచ్చినట్లు అనిపించదు. అప్పుడు ప్రచురణ విషయం ఆలోచిస్తాడు. అతనికి నచ్చినంత మాత్రాన అది మంచి కథ అయిపోదు. ‘కాకిపిల్ల కాకికి ముద్దు’- అనే ధోరణిని గుర్తుతెచ్చుకుంటాడు.
కథ ప్రచురణ కోసం ఏదో పత్రికకు పంపించడం జరిగినప్పుడు, ఆ రోజునుంచీ ఎప్పుడు అచ్చులో చూస్తానా అని తపిస్తూ వుంటాడు. కథ ఆమోదయోగ్యం కాకుండా తిరిగి వచ్చేసినప్పుడు నిరాశపడతాడు. పత్రికల వాళ్లను తిట్టుకుంటాడు- మనసులోనే. ఇక్కడ ఒక విషయం గుర్తుచేసుకోవాలి కథా రచయిత. కథ తిరిగి వచ్చినంత మాత్రాన అది ఆమోదయోగ్యత లేనిపోయినదని అనుకోకూడదు. పత్రికలకు అనేక కథలు వస్తూ వుంటాయి. పత్రికలకు వున్న పేజీలు రుూ కథను యిముడ్చుకోలేక పోవచ్చును. ఎడిటర్‌కు ఎన్నుకునే పనివున్నది గదా. పత్రికను చెత్తాచెదారంతో యెలాగో నింపివేయడమే అతని పని కాదుగదా. లేక రుూ రకమయిన కథా గమనం అతనికి నచ్చినది కాకపోవచ్చును. కథ తిరిగి రావడం రచయితకు మరో అవకాశం కూడా కల్పిస్తుంది. మళ్లీ దాన్లో యేమయినా లోపాలు వున్నాయేమో పరిశీలించి చూచుకుందుకు అవకాశం వచ్చిందన్నమాట! దీనిని ఉపయోగించుకుని, కథను పునర్నిర్మాణం చేసుకోవచ్చు. కథ అచ్చు అయినంతమాత్రాన అదో గొప్ప కళాఖండం అనే భ్రమలోనూ పడగూడదు రచయిత. జీవితంలోని ఎత్తుపల్లాలలాగ వాటికీ సమశృతిలోనే తీసుకోవాలి. కొన్ని పత్రికలు ‘చెత్త కథల పోటీ’లు కూడా నిర్వహిస్తూ వుంటాయి. తమకు వచ్చినవాటిలో ‘అత్యుత్తమ చెత్తకథ’కు పురస్కారం కూడా యిస్తాయి. (ఈ పద్ధతి యింకా మన తెలుగు పత్రికలకు పాకలేదు, మన అదష్టంవల్ల.)
అసలు విషయం యేమంటే- కథారచయిత కూడా మామూలు మనిషే. కాకపోతే, జీవితాన్ని సరికొత్త కోణాలలో చూస్తూ వుంటాడు. కథా రచయిత కూడా జీవితానుభవం సంతరించుకున్నకొద్దీ పరిణతి చెందుతూ వుంటాడు. తను రాసిన కథను రెండోమారు చదివి సరిచూచుకొని రచయిత, చదువరులు తమ కథను చదివి తీరాలనుకోవడం వృథాశ్రమ.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584