సాహితి

గతమే తప్ప వర్తమానం లేనోళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతమే తప్ప
వర్తమానమంతా
గిరగీసిన దూరమై,
చెప్పినదే పదే పదే-
వల్లెవేస్తే,
వింటున్న వాడికి
మహా సుత్తి పోటై
పరిచితులంతా దూరమైపోయే
మలి దశలోని ఒంటరితనం
ఎవరూ పంచుకోలేని ముసలితనం!
వృద్ధాశ్రమాల తలుపులు కూడా-
తట్టలేని నిరాశ్రయులు
వయస్సు కాటేసిన విగత జీవులు,
మీకు ఎదురైతే తప్పుకోకండి
వారికి మీ చేతనైన సహాయం-
అంతిమ యాత్రలో
ఒక ఊరట
మనిషి జన్మకొక సార్థకత!!

- నిఖిలేశ్వర్, 9177881201