సాహితి

ప్రవాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దినదినం బతుకున్నమో
క్షణక్షణం చచ్చిపోతున్నమో
పెయ్యంతా పొగల పొగల ఆవిరి
కొద్దికొద్దిగా మొద్దు మార్చుతున్న తిమ్మిరి

పడుకుంటే లేస్తే నడిస్తే
పనిచేస్తే గడిస్తే తడిస్తే
ఏదో అతిగొట్టుగా
గుట్టుగా పోగొట్టుకుంటాం

వయస్సు మనస్సు
సవ్వా సూటిగా ఒక్కటిగా
నదిలా ప్రవహిస్తున్నప్పుడు
ఒకరికొకరు పరిచయం కాలేరు

గాడిలో పడుతుందనేసరికి
బతుకు అతుకుల మాసికగా
తెలిసి జారి దారి తప్పిపోతుంది

పగలు కండ్లుకు చీకట్లు కమ్ముకుంటై
రాత్రి నయనాలకు
చూపు రూపు మాసిపోతుంది
పగలు కండ్లుకు చీకట్లు కమ్ముకుంటై
రాత్రి నయనాలకు
చూపు రూపు మాసిపోతుంది

శరీరం విల్లు అయనప్పుడు
ఒళ్లంతా కళ్లు చేసుకు
ఆయుధం చేపట్టేవాని కోసం చూస్తాం
పరాక్రమం క్రమంగా
యుద్ధ్భూమి నుంచి
చెప్పాపెట్టక వెన్ను చూపుతుంది
తలసిన కలసిన మనసును
పిల్లవేర్లు కదిలిపోయేలా
తీరొక్కగా వేరుచేస్తుంది

ముట్టి ముట్టగానే విచ్చుకునే పువ్వు
ఎంత స్పరిశంచిన నచ్చుకోని నవ్వు
ఎదలో విరిగిన ముల్లు
సలుపుతూ వుంటుంది
ఎరుకైన కొద్దీ కరుకై
ఫరకై పోతుంటాం

ఎత్తుకుంటే సంకకు రాక
దించితే నడువక కుంటుపడడం
కలిస్తే కలహించుకోవడం
విడితే జడివానై ఏడువడం

మనస్సుతో కూడిన వయస్సు
కలవరపరిచి కలల్ని చెదురకొడుతుంది
కోరిక నెరవేరినప్పుడు
బతుక్కు తీరిక లేదు
తీరిక దొరింపు అయనప్పుడు
కోరిక ఎటమటమై ఎత్తిపోతుంది

అతనికి ఆమే అన్నీ
ఆమెకు అతడే కొనే్న
ప్రవాసం కాదు బహిరంగం ఈడేరదు

కలిస్తే చల్లిస్తే ఒక్కటే
విడితే చరిస్తే రెండంటే రెండే
పోగొట్టుకొని లెంకులాడడం
దొరికినంక దరికి చేరకపోవడం

సిగ్గిల్లినప్పుడల్లా
జతకతలా నిస్సిగ్గు అయపోతుంది

- జూకంటి జగన్నాథం, 9441078095