సాహితి

అభినందనాత్మక విమర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాగర్థ
(ఆధునిక సాహిత్య వ్యాసాలు),
రచయిత: డా శిఖామణి,
వెల: రూ.120,
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు

పలురకాల విమర్శల్లో అభినందనాత్మక విమర్శ ఒకటి. దీనిని ‘ప్రశంసా విమర్శ’ అనవచ్చు. అభిమానంతో వాదోపవాదాలకు తావు లేకుండా, మరీ లోతుగా వెళ్లకుండా స్తుతిపరంగా విమర్శించడం దీని లక్షణం. తెలుగులో చాలా సాహిత్య విమర్శలు ఇలాగే ఉంటాయి. ఈ కోవలోవకి చెందినదే శిఖామణి సాహిత్య వ్యాస సంపుటి ‘వాగర్థ’. పేరు చూసి ఇదేదో కొరుకుడుపడనిది అనుకోనక్కరలేదు. పఠనీయతతో కులాసాగా చదవదగిన పుస్తకమే ఇది. మరొక విధంగా చూస్తే ఈ వ్యాసాలలో పరిచయాత్మక విమర్శనూ గమనిస్తాం. ‘ముందుమాటలు సామాన్యంగా అతిశయోక్తులతో కూడుకొని వుంటాయి’ అన్న అభిప్రాయంలో నిజం లేకపోలేదని ఈ పుస్తకానికి గల ముందుమాటలు చెప్తాయి. జాషువా గురించి పాడిందే పాటగా దళిత తత్వం గురించి చెప్తారు తప్ప అతని కవిత్వంలోని వస్తు వైవిధ్యాన్ని చెప్పరు. శిఖామణి అలా కాకుండా జాషువా కవిత్వంలో జీవన వైవిధ్యం అనే కొత్త వ్యాసం రాశారు. ‘శ్రీశ్రీ కవిత్వంలో పురాణ ప్రతీకలు’ అనే వ్యాసంలో అంతగా నూతనాంశాలు కనబడవు. మిరియాల రామకృష్ణ తన సిద్ధాంత వ్యాసంలోను, ఈ సమీక్షకుడు ఒక వ్యాసంలోను వీటి గురించి వివరించారు. హోమం పవిత్రమైనది, దీక్షాబద్ధమైనది. అగ్ని అనేది నిప్పు. పారిశ్రామిక అభివృద్ధి అగ్నిమీదనే ఆధారపడింది. ‘సమిధ’ అనేది పవిత్రమైన కార్యంలో లక్ష్యసాధన కోసం చేసే యజ్ఞంలో ఒక భాగం. సమిధనిచ్చాను అంటే తన త్యాగం వుందని శ్రామికుడు అంటున్నాడు. ఈ విధంగా ప్రతీకల్ని లోతుగా వివరించాలి. శని పట్టుకొని పీడిస్తాడు, ‘వీడు శనిలా దాపురించాడు’ అనేది లోకోక్తి. పెట్టుబడిదారుడికి ప్రతీకగా శనిదేవతను శ్రీశ్రీ గ్రహించాడు. కాబట్టి శనిదేవతను చెప్పడం ఆశ్చర్యం కాదు- సముచితం! ‘మహాప్రస్థాన కవిత్వంలో మరణ మృదంగం’ వ్యాసం కొత్త కోణంలో రాయబడింది. శ్రీశ్రీ రెండుసార్లు టైఫాయిడ్‌కి లోనయ్యాడు. ఇక బతకడన్నారు. అప్పటి స్థితీ, తాను నిరుద్యోగిగా ఉన్న స్థితీ శ్రీశ్రీని కలవరపెట్టి ఉంటాయి. అందుకే మరణభావనలు! ‘సినారె కవితారోహణ’ సద్విమర్శతో కూడుకొన్నది. ‘వచన కవి’ అనటంకంటే దీర్ఘకావ్య కవిగా రాచపాళెం అనటం సమంజసంగా వుంటుంది. నానీలపై రాసిన వ్యాసంలో వివరణలు, విశే్లషణలు తక్కువై ఉదాహరణలు ఎక్కువయ్యాయి. దూదిమేడ నాళేశ్వరం శంకరానికి మారుపేరయింది. దీనిపై 1997లో రాసిన వ్యాసం ఇందులో వుంది. మహాత్మాగాంధీ తర్వాత అంబేద్కర్‌పైనే విస్తృతమైన సాహిత్యం వచ్చింది. శిఖామణి అంబేద్కర్‌పై వెలువడిన కవిత్వాన్ని పోగుచేశారు. వారి సేకరణనుంచి కొంత ఒక వ్యాసంగా రాశారు. బోయ జంగయ్య వంటి కవులు ఈ వ్యాసంలో కనబడకపోవడం ఆశ్చర్యమే! శిఖామణి పఠన పాఠనాలలో అనుభవజ్ఞులు. దళిత, సాహిత్యతత్వం శిఖామణికి పేరు తెచ్చిన పుస్తకం. ఈ వాగర్థ వాటి సరసన చోటు తప్ప ప్రత్యేకమైన స్థానం సంపాదించదు. ఎందుకంటే ఇవన్నీ ఆయా సందర్భాలకోసం రాసినవి తప్ప తనంత తాను ప్రేరితుడై తపనతో రాసినవి కావు. ఏమైనా ఆధునిక కవిత్వాన్ని అంచనావేయడం, కొత్తవి తెలుసుకోవడం అనేవి ఈ పుస్తక ప్రయోజనాలు.

- ద్వా.నా.శాస్ర్తీ, 9849293376