సాహితి

కథా సంకుచితం (శ్రీవిరించీయం 18)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెప్పదలుచుకున్న కథనం చాలానే వున్నా రచయితలు ఒక్కొక్కసారి దానిని సంకుచితం చేసేస్తు వుంటారు. కార్డు కథలు, పేజీ కథలు యిలాగే పుట్టాయి. ఇటువంటి చిన్న కథను చిత్రిక అనో, అల్పిక అనో అనడం కూడా అలవాటుంది. గల్పిక మరో పెద్ద కథకాదు గాని, చివరలో ‘మెలికముడి’వేయడంతో అంతం అవుతుంది. రామాయణం కథను సంకుచితం చేసి ‘కట్టె, కొట్టె, తెచ్చె’అని మూడుముక్కలలో చెప్పి వేయడం అందరూ ఎరుగుదురు. ఈ కథనే 24000 కాల్పకాలుగా వాల్మీకి వ్రాశాడు. వందలాది పేజీలతో కావ్యాలుగాను కథలుగానీ ఎందరో రాశారు. ఉత్తరాలు, సంభాషణలతో కథను నింపివేయడం లోగడ చూశాం. అలాగే కథనంతటినీ ‘ఏకవాక్యం’తో వ్రాసివేయడం గూడా ఒక చిత్ర ప్రక్రియ. కథలో ఎన్ని వాక్యాలు వున్నాయి, ఎన్ని పేజీలు నిండుతున్నాయి అనేది కాదు ప్రశ్న. దాదాపు 5000 మాటలున్న కథలుకూడా వున్నాయి. అవి నవలలు కావు. కథకు కావలసిన ఏకత, క్లుప్తత, సజావు పఠనీయత వున్నంతవరకు- కథకు యిన్ని పేజీలు వుండాలి అని నియమం యేమీ లేదు.
ఏక వాక్య కథకు రెండు ఉదాహరణలు యిస్తాను.
1. ఆ దంపతులు నెల రోజులపాటు తీర్థయాత్రకు వెడుతూ, తమ ఇల్లు భద్రంగా చూచుకోమని కారుడ్రైవర్‌కు పురమాయించగా, ఆ డ్రైవరు యజమానులు తిరిగి వచ్చేలోపుగా యింటి వంటకత్తెను తీసుకుని పరాయి పట్టణానికి పరారయిపోయాడు.
2. రైలుప్రయాణం చేస్తూ వున్న ప్రయాణికుడిని తోటిమనిషి ‘దయ్యాలు వున్నాయని నువ్వు నమ్ముతావా?’ అని ప్రశ్నవేసి, అతని జవాబు పూర్తిగా వినకుండానే మటుమాయం అయిపోయి గాలిలో కలిసిపోయాడు.
ఇలాంటి కథలు ప్రయోగాత్మకంగా చమత్కార ధోరణిలో బాగుంటాయేమోగాని రమ్యత, సాదరత తీసుకురావు. చిత్ర కవిత్వం లాగా యిదో తమాషా ప్రక్రియగా చలామణి అవుతుంది తప్ప, కథకు కావలసిన నిండుతనాన్ని తీసుకురాదు.
ఉదాహరణకు మొదటి కథలో అయిదారు కథలు నిక్షిప్తంగా వున్నాయి. ఓపిక, నిదానము వున్న రచయిత అయితే అవన్నీ విడివిడిగా వ్రాసుకుని, ఆత్మానందం పొందడమే కాకుండా చదువరులనూ సంతృప్తి పరచగలుగుతాడు.
నెల రోజుల తీర్థయాత్రకు ఎంతో ప్రయత్నం కావాలి. ఆఫీసులకు సెలవులు దొరకాలి. ఖర్చుకు అవసరం అయిన డబ్బు సమకూర్చుకోవాలి. ఎక్కడెక్కడికి వెళ్లాలి. ప్రయాణ వివరాలన్నీ తీరుబాటుగా చేసుకోగలగాలి. ఇల్లు భద్రతకోసం నమ్మకస్తుడిని యేర్పాటుచేసుకోవాలి. డ్రైవర్‌కు, వంటకత్తెకు తగుమాత్రం డబ్బు ముందుగానే యిచ్చి వాళ్లను ఆకట్టుకోవాలి. వాళ్లు నమ్మకస్తులు అనే భరోసా చిక్కటానికి ముందు రెండుమూడు ఉదాహరణలు కూడ వుండాలి. వాళ్లిద్దరూ ఎన్నాళ్లనుంచి యిలా ఉభయ సంపర్కం యేర్పరుచుకున్నారో చదువరికి నమ్మకం కలిగేట్లుగా చెప్పాలి. వాళ్లకు సంసారాలు, కుటుంబాలు వుంటే వాటితో తమ రుూ అక్రమ సంబంధాన్ని ఎలా యిముడ్చుకోగలుగుతున్నారో స్పష్టంగా చెప్పగలగాలి. పరారయిన వాళ్లను పోలీసులు పట్టుకోకుండా యెలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చునో వాళ్లమధ్య సంభాషణలు జరగాలి. కథ అక్కడితో అంతమయిపోయినా, వాళ్లందరూ చివరకు యేమయ్యారు అని ప్రశ్నను చదువరులలో ఆసక్తికరంగా కూర్చగలగాలి.
ఒక కథలోంచి అనేక ఉప కథలు పల్లవించటానికి అవకాశం వుంది. కథకు బహు వ్యాపకత్వం గూడా వున్న విషయం మా రూపుకు రాకూడదు. కథను నాటికగా రూపొందించుకోవచ్చు. కథ సంపుటిలో జోడించి గ్రంథస్థం చేయవచ్చు. కథల సంకలనాలలో చోటు సంపాదించుకోవచ్చు.
సంకుచితం, సంక్షేపం అయిన విషయాలు గూడా పెద్దపెద్ద కథలుగా మానవ జీవితంలో స్థావరించుకోవడం అనుభవైకవేద్యమే.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584