సాహితి

సంక్లిష్టత నుంచి సమగ్రత (శ్రీవిరించీయం 21)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కథ’ అనేది ఒక సమస్యకు పరిష్కారం చూపించాలా లేక కేవలం సమస్యను ప్రదర్శిస్తే సరిపోతుందా?- అనేది వివాదాలకు గురిఅయిన ప్రశ్న. జీవితంలో వున్న చీకటి కోణాలను టార్చ్‌లైట్ చూపించి అందరికీ కనిపించేట్లు చేస్తే చాలును, పరిష్కారం ఎవరికివారు తమ చిత్తసంస్కారాన్ని అనుసరించి కనుక్కుంటారు. కథకుడేమీ చదువరుల కర్మ నిర్దేశకుడు కాదు- అనేవాళ్లు కొందరున్నారు. మరికొందరు యిందుకు వ్యతిరేకంగా మాట్లాడుతారు. సమస్యను ఎవరయినా చూపించగలరు. సృజనాత్మకత వున్న రచయిత- జీవిత చరిత్రను అనేక కోణాలనుంచి ప్రదర్శించేవాడు- తనకు తోచిన పరిష్కారమార్గాన్ని చూపించకపోతే యిక అటువంటి కథను వ్రాయడం ఎందు కు?- అనేది వాళ్ల వాదన. ఇటువంటి వాదనలు జీవితంలో ప్రతి విషయాన్ని గురించే బయలుదేరటానికి, మనుష్యులను విడదీయడానికి ఎన్నయినా వున్నాయి.
‘కథ’ అనేది జీవితానికి దర్పణం లాంటిది. దర్పణం వున్నదానిని ఉన్నట్లు చూపిస్తుంది తప్ప భవిష్యత్తు చిత్రాలు చూపించలేదు. ఈ చిత్రాలు చదువరి మనస్సులోనుంచి ఉద్భవించాలి; ప్రభవించాలి. రచయిత తనకు తోచిన పరిష్కారం చూపిస్తే తప్పేంలేదు, కాని చూపించకపోతే మటుకు అతన్ని తప్పుపట్టటానికి వీలులేదు- అని చాలామంది అభిప్రాయపడతారు.
ఇంతకూ- మూల విషయం యేమంటే, మనిషి పరిస్థితులకు దాసుడా లేక పరిస్థితులను శాసించగల సామర్థ్యం వున్నవాడా? అతను రుూ రెండూ చేయగలడు అని మనం అంగీకరించగలగాలి. జీవితంలో యిదా? అదా? అనే ప్రశ్న లేదు. రెండూ యదార్థమే, మనముందు సాక్షాత్కరించేవే! అయితే దానిలో దేనిని ఎంచుకుంటాడో మనిషి యిష్టం. ఆలోచన పరుడయితే, మంచి మార్గాన్ని అనుసరిస్తాడు. ఆలోచన ద్వారాలు తెరవడం యింకా నేర్చుకోనివాడు, చేతకానివాడూ అయితే యింద్రియ లోలత్వంలో పడిపోయి ఎదురుగా కనిపిస్తున్న తప్పుదారిని అనుసరిస్తాడు. అందరూ త్రొక్కి నడిచిన దారి సుగమంగా ప్రయాణం చేయడానికి అనువుగా వుంటుంది గాని, ఎవరూ యింతవరకు అడుగులు వేయని దారి ముళ్ల కంచెలతో, గందరగోళంగా వుంటుంది. ఈ దారిని వెళ్లడానికి మనిషి తన ఇచ్ఛాఖడ్గాన్ని తీసుకుని అడవులు- చెట్లుచేమలు కొట్టుకుంటూ తనదారిని తను యేర్పాటుచేసుకుని ముందుకుపోవలసి వుంటుంది. శ్రమతో కూడుకున్న పని అయినా, ఫలితం మటుకు చక్కగా సాఫల్యంగా వుంటుంది. కథ అనేది- సాహిత్యంయొక్క ప్రక్రియ అయినప్పుడు- మనిషి జీవితాన్ని సుఖకరం, సరళతరం చేసుకుందుకు అవకాశం కల్పించేదిగా వుండాలి.
చిన్న ఉదాహరణ: ఒక ఉద్యోగి మదరాసునుంచి ఢిల్లీకి ఆఫీసు పనిమీద వెళ్లి అక్కడ యాదృచ్ఛికంగా ఒక యువతితో పరిచయం సంపాయిస్తాడు. ఈ పరిచయం క్రమంగా పెరిగి పెరిగి, అతని మనస్సును పూర్తిగా లొంగదీసుకుని, పదేళ్లనుంచి కాపురంచేస్తున్న భార్యకు విడాకులు యిచ్చేసి ఈ కొత్త అమ్మాయితో జీవిత శేషం మరింత కులాసాగా గడపాలని నిర్ణయాన్ని తీసుకువస్తుంది. ఈ నిర్ణయానికి వచ్చిన తర్వాత అతను మదరాసునుంచి ఢిల్లీకి వెళ్లే డొరాంటో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణంచేస్తూ వుండగా దారిపొడుగునా భార్యతో తను పొందిన సుఖ సంతోషాలు, ఆనంద ఘడియలు గుర్తుకువచ్చి ‘ఎందుకు యిలాంటి మంచి మనిషితో తెగతెంపులు చేసుకుందామనే మూర్ఖపు ఆలోచన చేశాను?’ అని తనను తాను నిందించుకుంటాడు. తీరా ఢిల్లీకి చేరిన తర్వాత, ఎదురు ప్లాట్‌ఫాం మీద మదరాసుకు వెళ్లే మరో డొరాంటో ఎక్స్‌ప్రెస్ కనిపించడంతోటే, వేరే ఆలోచన లేకుండా - టిటిఇతో మాట్లాడేసి తిరుగు ప్రయాణం ప్రారంభిస్తాడు. ప్రయాణంలో జరిగిన ‘పదనిసలు’ యివి. మనిషి మనసు శాఖా చంక్రమణం చేసే కోతి లాంటిది- అని అతను గుర్తించటానికి అతని సంస్కారం, చదువు, ఉద్యోగ ప్రతిపత్తి సహాయం చేసి వుండాలి! ఇలాంటి కథవల్ల నిడశ్రీ్గఱఉ నిజనిఉడలో వున్న యిబ్బందులు, ఒడిదుడుకులు చదువరులలో అవసరం అయినవారు సమాలోచన చేసుకుందుకు అవకాశం వుంది. సాహిత్యం సంసార బంధాన్ని దృఢతరం చేయటానికి ప్రయత్నించాలి గాని విచ్ఛిత్తికి తద్వారా సామాజిక అసమగ్రతకు దారితీయకూడదు.
కథలకు సాంఘిక, సామాజిక ప్రయోజనం యెంతవరకూ వున్నదని యిటువంటి కథలు చెప్పకుండానే చెప్పుతాయి.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584