సాహితి

అక్రమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ చెట్టు -
ఆశల మొగ్గ తొడిగింది
చిగురించే జీవముంది కదా అని
బాట పక్కన నడక సాగించాలనుకుంది
గాలి ఆసరాతో.

ఎక్కడకక్కడే అపర్యావరణాల
కంచెలూ కత్తులూ
ఇక మిగిలింది
మోడు మానుల వ్యథా నిట్టూర్పులొక్కటే

ఆ నది -
ఉరుకులు పరుగులుగా పారుతూంది
బిందువులన్నీ జీవధాతువులే కదా అని
వేళ్లను తడిమే చెమ్మనవదామనుకుంది
ఆనకట్టల ఆసరాతో.

ఎక్కడకక్కడే జల సమరాల
ఆవేశాలూ ఉద్వేగాలూ
ఇక మిగిలింది
ఎన్నటికీ తీరని నీటి పంపకాలొక్కటే

ఆ పూలూ... అంతే
ప్రాకృతిక సోయగంతో
కనువిందు చేస్తున్నాయనుకుంటే
వేకువజామునే
పూజాద్రవ్యంగా మారిపోయాయి.
విరి చోరులు తెంపుకుపోతున్నారు నిర్దయగా
ఇక మిగిలింది
పుష్ప విలాపమొక్కటే.

- దాట్ల దేవదానంరాజు, 9440105987