సాహితి

వొక పగిలిన కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రాత్రి ననె్నలా నిద్రపుచ్చుతుంది?

సౌకర్యాల లేపనం రాసుకున్న ఒంటికి
చెమట చుక్క బరువైన వాడిని
పట్టిందల్లా బంగారంగా మెరిసి
నడమంత్రంగా అందలమెక్కిన వాడిని
చుట్టూరా పచ్చనోట్ల రెపరెపల గాలులకు
ఉల్లాసంగా పరవశాల ఊయలలూగిన వాడిని

అయినా ఈ రాత్రి నేనెలా నిద్రపోవాలి?

చట్టాల లొసుగులకు వల పన్ని
నల్ల పుస్తకంలో దాచుకున్న వాడిని
ఏ ముఖానికి తగిన ఆ రంగు పూసుకుని
మరకలు అంటని చొక్కా ధరించిన వాడిని
డబ్బుని ప్రేమించి మోహించి
సకల మానవ సంబంధాల్ని తెంచుకున్న వాడిని

అయినా, గానీ ఈ రాత్రిని ఎలా దాటించగలను?

అడ్డమైన దారుల్ని రాజమార్గంగా మలుచుకుని
ఊహించనంత ఎత్తుకు ఎదిగినవాడిని
నిశ్శబ్దాలకి పలు ప్రలోభాల్ని అంటించి
గోదాముల్లో సంచుల్ని నింపిన వాడిని
చేజిక్కించుకున్న కలలకు
వ్యూహాత్మకంగా వెండి జిలుగుల్ని అద్దిన వాడిని.

ఇంక ఈ రాత్రి ననె్నలా సముదాయిస్తుంది?

నేలను గజాలుగా కొలతలు వేసుకుంటూ
మట్టిని కనకపు రాసులుగా పోగేసిన వాడిని
నగిషీ బల్ల కింద కడియాలు తొడిగించుకుని
నిర్లజ్జగా జేబులు ఉబ్బించిన వాడిని
అరచేతుల్లో ప్రజాస్వామ్యానికి వెలకట్టి
పదవుల వ్యాపారాన్ని చేపట్టినవాడిని.

నోట్ల ప్రపంచం అదే పనిగా కుదుపుతూంది
నేనిపుడు నిద్ర పట్టని రాత్రి సమయాన
నల్లటి చూపులతో రెప్పల్ని కాల్చుకుంటున్నాను.

- దాట్ల దేవదానంరాజు, 9440105987