సాహితి

కథలలో పక్షపాతాలు 25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంఘిక జీవనంలో ఆశ్రీత జనపక్షపాతం (నెపోటిజమ్) అనేది పాలకవర్గాన్ని, అధికార పదవులలో వున్నవాళ్లను అంధులను చేస్తుంది. నిజానికి యిది లంచగొండితనం (కరప్షన్) కంటె కూడ ప్రమాదమయినది, పక్కనపెట్టవలసినదీని!
సంఘంలో అన్యాయం జరుగుతోంది- అని అన్నప్పుడు, ఆ అన్యాయానికి ఆహుతి అవుతున్నవాడు ఏ కులంవాడు, ఏ మతంవాడు, ఏ ప్రాంతంవాడు- అనే ప్రశ్నలు బయలుదేరుతున్నాయి. ఈ ప్రశ్నలు, పరిశీలనలు- జనాన్ని మళ్లీ వేరువేరు గుంపులుగా విభజించి వేస్తున్నాయి. ‘మనిషికి అన్యాయం జరగడం సహించం’ అని ఏక కంఠంతో చెప్పవలసిన అవసరం వుంది. ఈ మనిషి నావాడా, నీవాడా, వాడవాడలా తిరిగేవాడా అనే విషయం కాదు చూచుకోవలసింది. మనిషి వాడవాడలకూ చెందినవాడు, వాసి చెడని వాడు - కావాలి.
కుల ప్రాతిపదిక మీద, మతప్రాతిపదికమీద అన్యాయాలను గురించి రాస్తున్నప్పుడు ఆ జరిగిన సంఘటన ప్రత్యేకంగా ఆ కులానికో, మతానికో చెందిన మనిషికి మటుకే అన్వయించేది అయి వుండాలి. ఆ సంఘటన యితరులకు జరగడానికి వీల్లేకుండా, ఆ ప్రత్యేక వర్గానికి మటుకే బాధగా తయారుఅవుతోందా లేదా అని సరిచూచుకోవాలి.
మనిషికి సంబంధించిన వాదాలు ఎన్నయినా వున్నాయి కాని యివన్నీ మానవతావాదం (హ్యూమనిజం)నుంచి పుట్టుకువచ్చినవే. మీరు వేరువేరుగా ఎగ్జిస్టిన్షియనిజం (అస్తిత్వవాదం), ఇండివిడ్యువలిజమ్ (వ్యక్తిత్వవాదం), స్ర్తివాదం (ఫెమినిజం), దళితవాదం - అని అనేక శాఖలుగా వాటిని విభజించుకోవచ్చును. ఏ వాదమయినా మనిషికి జరుగుతున్న అన్యాయాన్ని సహించదు, ఎదురిస్తుంది. ఏరోజుకారోజు యేదో కొత్త పేరుతో ఒక వాదం వచ్చింది గదా అని, వెనకటి వాదాలన్నీ మరుగున పడిపోయినాయని అనుకోవటానికి లేదు.
మానవత, సాంసారిక కథల పరిధులు ఈ వాదాల వల్ల విస్తృతి పొందినట్లుగా భావించుకోవాలి. సమాజంలో అనేక వర్గాల తీరులు వున్నాయి. దేనినీ అశ్రద్ధచేయకుండా, తక్కువ చూపుచూడకుండా- దేని విలువ దానికి యివ్వగలగడం సముచితం. రచయితకు సమర్థత అవసరం. ప్రతి మనిషీ తన చదువు, సంస్కారాలనుబట్టి సంఘంలో తాను పెరిగిన, ఎదిగిన రీతులనుబట్టి ఒక జీవిత తత్త్వాన్ని (్ఫలాసఫీ ఆఫ్ లైఫ్) తయారుచేసుకుంటాడు. తన ఆలోచనా ధోరణి, జీవన విధానం యిలా యేర్పాటుచేసుకున్న తత్త్వం మీద ‘నల్లేరు మీద బండి’ లాగ నడచిపోతూ వుంటుంది. అతడు ఎదుగుతున్న కొద్దీ రుూ సిద్ధంతాలను, తత్త్వాన్ని సరిచూచుకుంటూ వుంటాడు. అవసరం అయితే మార్పులు, చేర్పులు చేసుకుంటూ వుంటాడు. ఆ క్షణంలో తన చిత్త సంస్కారం, ప్రేరేపించిన పద్ధతితోనే ప్రవర్తించడం అందరికీ అలవాటు అయినదే.
ఒక చెట్టు వుంటే దానికి ‘నిబద్ధత’ వుంటుంది. నాటుతున్న చోటునుంచి అది కదలదు, తన శాఖలను మాత్రం అన్ని దిక్కులకూ పంపుతుంది. దానికేమీ నియమాలు, నిషేధాలు లేవు. చెట్ల మీద పక్షులు గూడుకట్టుకుంటాయి. చెట్ల పొదలలో పాములు నివాస స్థలం యేర్పరచుకుంటాయి. చెట్లకిందనే సంసారాలు చేస్తూ జీవితాలు వెళ్లదీస్తున్న జనావళి వుంది. చెట్టును భూమిక చేసుకుని మనకు ఎన్నో కథలు వచ్చాయి. దారిని పోయేవాళ్లందరినీ చెట్టు గమనిస్తూ వుంటుంది. వాళ్ల కథలు తను తెలుసుకొనడమే కాకుండా, అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు కూడా చెప్పుకుంటూ పోతుంది. చెట్టు మానవ జీవితంలో రంగరించుకుపోయిన స్థూల పదార్థం. ఒక్కో చెట్టు నుంచి వచ్చే గాలులు మనుష్యుల ఆరోగ్యాలను సరిదిద్దుతాయి. చెట్టు కింద అరుగులు వేసుకుని ఊరిపెద్దలు సభలు సమావేశాలు నడుపుకుంటూ వుంటారు. అనేక న్యాయ నిర్ణయాలు అక్కడ జరుగుతూ వుంటాయి. ఏ చెట్టుకయినా వున్న యే రెండు ఆకులూ ఒక్క మాదిరిగా వుండవు. చెట్లు తమ స్వగతాలను పసందయిన కథలుగా మలచి చెప్పగలుగుతుంది. రచయిత కూడా చెట్టుమీది ‘్భతాళుడు’ అయి - జనానికి నీతి, న్యాయం సోదాహరణగా చెప్పగలుగుతాడు. స్థిరత్వము, అస్థితత్వము రెండు లక్షణాలు, స్థిరంగా వుంటూనే అస్థిరత వయిపు వ్యాప్తి అవడం సృష్టిలో ఒక వైచిత్రి.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584