సాహితి

పాలమూరు మాండలికం ‘పామర సంస్కృతమా’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర సంస్కృతం - వెల: 300/-
రచన: కపిలవాయి లింగమూర్తి
- ప్రతులకు -
కె.సంధ్య అశోక్, 17-100,
వాణీసదనం, విద్యానగర్ కాలనీ,
నాగర్‌కర్నూల్. ఫోన్: 9000185437
**
బహువిధ గ్రంథ నిర్మాతలు సాహితీ లోక సుప్రసిద్ధులైన డా.కపిలవాయ లింగమూర్తి తమ సుదీర్ఘకాల పరిశోధనా ఫలంగా దాదాపు ఐదువేల పదాలతో సిద్ధంచేసి అందించిన ‘పామర సంస్కృతం’ అనే పాలమూరు మాండలిక పదకోశం ఒక విశేష రచన. క్రీ.శ.1948- 2000 సంవత్సరాల సుదీర్ఘ కాలం వీరు మహబూబ్‌నగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలు. పల్లెలు మొదలైన వాటిని దర్శించినప్పుడు ప్రజా వ్యవహార భాషా పదాలతోపాటు, కుల వృత్తుల వారి వతన్లు 12, వరికళ్లం కట్టడి- 20. జానపదులు గుర్తించిన పక్షులు- 190. ద్వంద్వ పదాలు- 190, అంగ వికారాలు 55, భాషీయులు 180. సాధారణ భాషీయాలు 42, న్యాయాలు- 100, ఆమ్రేడితాలు 13. ఇట్లా విభజించి జాబితాలనిచ్చి జిల్లాలోని భాషా వైశిష్ట్యాన్ని వివిధ రీతుల్లో తెల్పగలిగినారు. ఇదొక వినూత్న పద్ధతి, చాలకాలంగా సేకరించి నోట్‌బుక్కుల్లో భద్రపరచిన ఈ పద్యాల్లో కొన్ని వేలు- ఒకనాడు సాహిత్య ఎకాడమీవారు ప్రచురించిన మాండలిక పదకోశానికి ఎంతో ఉపకరించినవి, మరికొందరు పరిశోధకులనబడే వ్యక్తులు వీటిని గ్రహించి లింగమూర్తిగారి నిర్నామకర్మను నిరూపించి బాధకల్గించినారు. ఈ గ్రంథం దాదాపు 350 పుటల్లో సన్నఅచ్చు- అకారాది పద క్రమంలో సిద్ధమయింది, ‘అంకి’ అనే పదంతో ఆరంభమై, ‘హౌలా పని’- తో ముగింపబడింది. గ్రంథంలోని పదాలలో తెలుగు, ఇల్లా ప్రజల భాషాపదాలతోపాటు ఉర్దూ, అన్యదేశీయులు. ఇంగ్లీషు- పదాలు కూడా చాలా వున్నాయి. ఇవన్నీ పాలమూరు జిల్లా పదాలేనా? తెలంగాణం అంతటా ఈ పదాలు ప్రజల నాల్కల్లో నానుతున్నవే. ఉదా- అందాజా, ఆరాంకుర్చి, ఆస్మాన్ రంగు ఇజాషా, ఇశారా, ఉప్కాయించు, ఎకరారునామా. కాందాన్, కాంక్రీటు, కార్డు, గ్యాసు, గ్యాసు నూనె, ఇట్లా కొన్ని వందల పదాలున్నవి, వీటిలో అధిక భాగం సార్వజనీన ప్రయోగ భాషాపదాలుగా భావించి వదిలివేస్తే- నికరంగా మిగిలే పాలమూరు పదాలు స్వలవ్పంగానే వుంటాయి. లింగమూర్తిగారు గ్రంథ నామాన్ని గూర్చి తమ ‘కారణం- ప్రేరణం’ శీర్షికలో వింతగా వివరించినారు. ‘పామరుడు తాను సంస్కరించుకున్న భాష’ కాబట్టి ‘పామర సంస్కృతం’ అన్నారట. పామరుడు సంస్కరించిన భాషను తన వుచ్చారణ కనువుగా చేసుకుంటాడు కాబట్టి భాషాభేదం తప్పదు. అంతే కాని- దీనిని పామరునికే తెలియని ‘పామర సంస్కృతం’ అనటం వింతగానే వున్నది. వీరి పీఠికలో పండితులు, బ్రాహ్మణులు. భాషను తమకు ఎట్లా అనువుగా మార్చుకున్నది. దాన్ని తిరిగి పామరుల దరికి చేర్చిన విధానాన్ని గూర్చి తమదైన రీతిలో తెల్పటం ‘ఆకాశఖడ్గకేళి’ ని గుర్తుచేస్తున్నది. అంతేగాక ‘తెలంగాణ భాష అంతా పామర సంస్కృతమే దానిలో. పాలమూరు జిల్లా ఒక భాగం- అన్నారు. ఇంతకు పూర్వమే మాండలిక పదకోశాలు వచ్చినవి. భాషా శాస్త్ర పరిశోధకులు పాలమూరు పదాల గూర్చి చాలా కృషిచేసినారు. పాలమూరు జిల్లాకు చెందిన అప్పంపాండయ్య ‘మహబూబ్‌నగర్ జిల్లా తెలుగు. సామాజిక భాషా శాస్త్ర పరిశీలన’ అనే విషయంపై ఉస్మానియాలో పరిశోధన చేసి 1989లో పిహెచ్‌డి పొందినా 2007లో గ్రంథ రూపంగా వచ్చింది. దీన్ని లింగమూర్తిగారు పరిశీలించి యుంటారు. పాండయ్య పద విశే్లషణ యందు పాలమూరు రీతి ప్రతిఫలించినట్లు లింగమూర్తి ఈ కోశం సిద్ధం కాలేదు. వీరి పదాలను చూస్తే- చేరవలసినవి చాలా వున్నాయి. అట్లే- అనవసర పదాలు అధికంగా వున్నాయని తెల్పటానికి బాధ అనిపిస్తుంది. ‘అంకి’తో ప్రారంభమైన రచన ‘అంకుల్’ను చూపింది, ఇక- అగడు, అబ్బరీకం, ఆనె, ఆస్తత, ఆయమ్మ, అదువ, తాటాకు, ఉక్కబొట్టు, ఊరక, ఎదురుకోలు, కనుకుడు గింజ, కుచ్చం, కుతి, కొట్టం, గంగెద్దు గంగిరెద్దు, గచ్చులు (గప్పాలు) గుంటు క, గోకర్ణం (ఒక క్షేత్రం) గోలెం, చల్లు (బైటపారవేయు) సాదు, చల్లకాయలు, చుట్టకుదురు, చూరు, జాగీరు, జువ్వి (చెట్టు) జోలి (స్నేహం, సంబంధం) దబ్బున (తొందరగా) తట్టువ- (గుర్రం తట్టువ) తత్తళు= (తాళుము అని) తబుకు, తలె (పళ్లెం) తిన్నీకి, బలిజ (లు) దగ, దర్బారు, ధసల్. ధామంతం, దుద్దు (మోసం) దుద్దులు (ఒక ఆభరణం) దొంతులు, నక్షా, నసుకు, నివు (నీవు) నేలబళ్లు, పంచసంస్కారాలు, బస్తే, పదుల్లావు, పుల్లెగండు, బందారాకు, బారసాల, బేడెం, మార్గళి (్ధనుర్మాసం) మొదటి సంది, షక్‌లాద్, సరుకులు, సాపాటు, హిబాబ్, హిసాబ్- వంటి- పాలమూరు జిల్లాలో బాగా వాడుకలో వున్న ఈ విధమైన పదాలు చేరలేదు. దీనికి తోడు ఈ గ్రంథంలో అచ్చంపేట నాగర్‌కర్నూల్ తాలూకాల పదాలే అధికం. ఇంతకుముందు చెప్పినట్లు ఉర్దూ, ఇంగ్లీషు పదాలను కల్పలేదు. కానీ ప్రజల వాడుకలో యిప్పటికీ వున్న ఉర్దూపదాలు తప్పవు, లింగమూర్తిగారి కృషి ఎంతో గొప్పది, పదాలను- వింగడించటంలో నేర్పు ప్రదర్శించినారు.
కపిలవాయి లింగమూర్తి సాహిత్య కృషియందు ఈ ‘పామర సంస్కృతం’ రాణించగలదని విశ్వసిద్దాం.

- డా. శ్రీరంగాచార్య