సాహితి

కేరింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వానకి వయసు మళ్లింది, ఓపిక తగ్గింది
ముసలి నసలా చినుకుల్ని రాలుస్తోంది
వాకిలిముందు పారుతూ పిల్ల కాలువలు
సిరలు, ధమనుల్లా సాగిసాగి
క్రమంగా సనసన్నని నాళాలవుతున్నాయి
కాలువలో ముందు వేగంగా
అంతలో నిదానంగా-పడవలు, కత్తిపడవలు
వాటి వేగానికి చోదక శక్తినివ్వాలని
ఒకటేకేరింతలు, త్రుళ్లింతలు, కవ్వింపులు-
పిల్లకాయలు!
కత్తిపడవ కాలికి అడ్డంపడి
పయనాన్ని అడ్డుకుంది-పుల్ల
ఎగురుతూ చేయిసాచి, తీసి
తన ‘వస్తువు’ని తాను అందుకుంది పాప
ఇప్పుడది రూపం కోల్పోయిన పడవ!
ఇటు చివికిన పుల్ల చిట్లి చెదిరింది
అటు తడిసిన కాగితం విచ్చి పోయింది
పుల్లని ఆవలికి విసిరేసి
కాగితాన్ని విప్పి చూస్తే-‘కాలమ్’ కవిత!
‘కాలం ప్రవహిస్తునే ఉంటుంది
కవిత ప్రసరిస్తునే ఉంటుంది‘!
రేపటి గళం అక్షరాల్ని కూడబలుక్కుంటోంది
అవి నిత్య సత్యాలు!

- విహారి, 9848025600