సాహితి

కథ - ఆద్యంతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటి వాక్యంతోనే కథ మొదలుకాదు. ఒక పాత్రను పరిచయం చేయడమో, ఒక సన్నివేశానికి నాంది పలకడమో జరుగుతుంది. అసలయిన కథ తరువాత బయటపడుతుంది.
‘అతన్ని నేను అంతకుముందెప్పుడూ చూడలేదు. అయిదున్నర అడుగుల పొడవున, చక్కటి ‘ట్వీడ్’సూట్, బాటా చెప్పులూ వేసుకుని అందంగా వున్నాడు’ -అని మొదలుకావచ్చు.
‘వేసవికాలమే అయినా యింకా సూర్యుడు నడినెత్తికి రాలేదు గనుక వాతావరణం శీతలంగానే వుంది. బయటకువెళ్లి షికారుచేసి వద్దామన్న లత హాయిగా వుంది’-అని మరో రకం మొదలు.
కథాంతం మటుకు, కథలోవచ్చిన సంఘర్షణ సమరసంగా సమాప్తం అవడం, అందుకు పాత్రలందరూ సమాధానపడడంతో ముగుస్తుంది. ఒక్కోసారి ఎలాంటి ముగింపులేకుండా, సమస్యతో ఉత్పన్నమయిన అనేక స్థితిగతులను వివరించి, ఎట్లా పాత్రలు ప్రవర్తించటానికి వీలున్నదో సూచనగా చెబుతూ ముగుస్తుంది. కథ మధ్యలో వచ్చిన పీటముడులన్నీ విడిపోవు; వాటిని విడదీసే చాకచక్యం మటుకు పాఠకులకే వదలడం జరుగుతుంది. నిజానికి యేకథ కూడా ముగింపుకాదు. కథ నిరవధికంగా ముందుకు నడుస్తూనే వుంటుంది. సృష్టి అంతంఅయ్యేవరకు. కాకపోతే కథలో మనం చెప్పదలుచుకున్న అంశం పూర్తయిన తర్వాత తాత్కాలికంగా ముగింపు అవుతుంది. ఎట్లా ముగింపు అవుతుందో చదువరికి ముందుగా వ్యక్తం కాకపోవడం ఒక పద్ధతి అయితే, కథకు పెట్టిన పేరుతోనే కథాంశం అంతా తెలివిడి అయిపోవడం మరో పద్ధతి. రెండో పద్ధతి అంత మంచిదికాదు, కొన్ని సందర్భాలలో తప్పనిసరి అయినా.
కథ మొదలు సంభాషణతోనూ, ముగింపుకూడా సంభాషణ వాక్యంతోనే అవడం కూడా జరగవచ్చును.
‘ఇంతకూ యేం నిర్ణయించుకున్నావు, నారాయణా!’ అని కథ మొదలు అవుతే, చివరివాక్యం ‘అవునే్ల. అంతకంటె మరో మార్గం యేమున్నది గనుక!’ అని వుండవచ్చు. కథ మధ్యలో నారాయణ, యితర పాత్రలు యేంచేస్తారో- ఆ పని పరిస్థితులకు యెంతవరకు అనుగుణంగా, అనుసరణీయంగా వుంటుందో చదువరి ముందు ప్రదర్శితం అవుతుంది. కథ చివరలో చదువరికి ఒక ‘తాజాకలం’ చేర్చి, కథలో వ్యవహారాన్ని మరింత క్లిష్టమో ఆహ్లాదకరమో చేయడంకూడా ఒక పద్ధతి.
‘ఆ ఉత్తరం నేను వ్రాయలేదు’ అని ఒక పాత్ర ప్రమాణంచేసి చెబితే, మరో పాత్ర మొండిగా ‘నువ్వే రాశావు. కావాలంటే నేనూ ప్రమాణంచేసి చెబుతాను’ అంటాడు. అప్పుడు తాజా కలంలో రచయిత ‘ఆరోజుల్లో ఫోరెన్సిక్ టెస్ట్స్ అనేవి యింకా పుట్టలేదు అని జోడిస్తాడు. పాత్రలిద్దరూ తన్నుకుచావడంతోటే కథ అంతమైపోతుంది. కథ ప్రారంభం అవడం ఎంత ముఖ్యమో, అంతమయిపోవడం కూడా అంతే ముఖ్యం, అంతకన్నా ముఖ్యం కూడా.
‘నిజం నిలకడ మీదగానీ తేలదు. అది తేలేనాటికి ఆ మనిషి- రుూ ప్రపంచం నుంచే అంతర్ధానం అయిపోయాడు’ -అనేది ఒక అంతం. నిజంకోసం పోట్లాడి జీవితమంతా దుర్భరంగా గడిపిన దంపతుల కథ యిది.
‘వాళ్లకు యేడుగురు సంతానం కలిగారు. అయితే యేంలాభం? ఒక్కరూ బతికిబట్టకట్టలేదు. అతను చనిపోయిన తర్వాత ఆమె తను పల్లెటూరుకు వెళ్లిపోయి పనిపాటలు చేసుకుంటూ ఇంత కాలానికి తానుకూడా ప్రకృతిలో లీనం అయిపోయింది- అనేది పుత్రసంతానంకోసం రకరకాల తాపత్రయాలు పడ్డ దంపతుల కథాంతం. కథనం నీతితో అంతంచేయడం పూర్వ పద్ధతి. నీతి అంతా కథలో వ్యక్తంఅవడం- చెప్పకచెప్పడం నవ్య పద్ధతి. జీవితం పాఠాలు నేర్పుతూ వుంటుంది, అడుగడుగునా అయితే ఆ పాఠాలన్నీ వల్లెవేసుకునే వాళ్లు, గమనించేవాళ్లు, వాటివల్ల జీవిత గమనాన్ని మార్చుకునేవాళ్లు ఎందరు? అందరూ అలా మార్చుకుంటూపోతే, మనకు యిప్పుడు కథలే వుండేవి కావు.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584