సాహితి

భూమి చుట్టూ చందమామ...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్ళు జాబిలికి అతుక్కుపోయాక
పసితనంలోనే పంచ ప్రాణాలని వదిలేసిన విశేషం!
పదహారో ఎక్కం మొదలుపెట్టి పందొమ్మిది పూర్తవగానే
తిరగేసి గడగడా అప్పజెప్పమన్నపుడు-
భూమీద కఠిన ఘడియల్ని కూడా లెఖ్ఖించాలని తెలియలేదు.

శీతాకాలపు సూర్యుని వెచ్చదనం
అనుభవంలోకి వచ్చిందనే హాయితో
కళ్ళు అర మూతలు పూర్తిగా పడనే లేదు.
సున్నిత మనస్కుల్ని బలహీనులుగా అంచనా వేసేసారు.
కళ్ళల్లో పెల్లుబికిన గంగ సాక్షిగా
అక్షరాలే తుఫానుల నెదుర్కునే ఎక్కుపెట్టిన విల్లులు
బాణం వేసే ముందు
వింటి తాటిని వెనక్కు లాగి వదలడం వివేకం కదా?

నియమాలను అతిక్రమించి హద్దులు దాటి ఎగసిపడే భావోద్రేకాలు
గంగవెర్రులెత్తి ప్రచండ వేగంతో ‘్ఢ’కొన్నా
ఎతె్తైన శిఖరాల్నుంచి లోతైన లోతైన లోయల్లోకి పడిపోయిన
యుద్ధ అవశేషాలూ పలికేది ‘ఓంకారమే’! సత్ సహకారమే!
పూర్వమెప్పుడో అహంకారులు వాడిన పాచికలు నీ చేతికొచ్చినందుకు
గొప్ప సంతోషంతో ఇప్పుడు రొమ్ములు విరిచి
జూదంలోకి దిగిపోయానని సంబరపడినా..
అవి ముట్టుకుంటే చల్లగా తాకి
వేసినప్పుడు గుండెల్ని మండిస్తాయన్నదే కదా గత చరిత్ర.
దుందుడుకుతనం క్రోథావేశాల్ని ప్రకటిస్తే
వీర నాయకుడవడం తథ్యం!
అహంతో విర్రవీగిన గర్వం మిళితం చేస్తే కదా హింసోద్భవం?
కఠినత్వం చూపే ఉపాధ్యాయుడు నేర్పే పాఠాల్లో
ఎక్కువ గణాంకాలున్నట్టే
అత్యంత వినయమో మరింత తీపో
మనుషుల మధ్య అగాథాల్ని సృష్టిస్తుంది
మిత్రమా! శరీరమే ఒక యుద్ధ్భూమి.
వ్యాధుల యుద్ధాలు మొదలయితే వ్యాకులతే ఒక నరకం!
భూమి చుట్టూ తిరిగితేనేం చందమామ?
ప్రియుని తావు హిమవంతం..
ప్రేమ సందేశం కడు రమ్యం!

- బులుసు సరోజినీదేవి, 9866190548