సాహితి

ప్రాతఃకాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దున లేచి బయటకు చూడగానే
పొందికగా అటు కరెంటు తీగలపై కాకి సమ్మేళనం,
ఇంట్లో ఇటు పేపరు తిరగేయగానే
‘కరెంటు టాపిక్’లపై కవి సమ్మేళనం;
ప్రతిరోజూ ప్రత్యక్షం!
కాకులేమో-
ఎవరింటికి చుట్టాలొస్తున్నారో
ఎగిరిపోయి ఎరుక చేయాలని- ఏకబిగిని అరవాలని
ఎవరెవరి యింట్లో పిండ ప్రదానం జరుగుతోందో చూసి
ఏకంగా ఎత్తుకుపోవాలని
అదేపనిగా చర్చించుకుంటున్నాయి!
అదేపనిగా నిర్ణయించుకుంటున్నాయి!
కవులేమో-
ఇజాలతో భుజాలు కలిపి
‘ఇగో’లతో తొడలు చరిచి
‘పాలిటిక్స్’తో ప్రతిభలు మరచి
అయినవాళ్ళనే ఆత్మీయంగా వెన్నుచరిచి
కానివాళ్ళను కసిగా పెన్నుతోపొడిచి
ఎవరు ఎన్నుకోకున్నా
ఎవరికివారే సంఘాల్ని స్థాపించుకుని
ఏకంగా అధ్యక్షులమని ప్రకటించుకుని
విర్రవీగుతున్నారు!
నాయకులకు బాకాలవుతున్నారు!
కవి అంటే కష్టజీవికి ఇరువైపులా
కాపలా వుండే చిరంజీవి అన్న అర్థాన్ని మరచిపోతున్నారు!
కాకుల్లా ఎంగిలి మెతుకుల
పదవులకై ఆశపడుతూ కైతల్ని గుప్పిస్తున్నారు!
నేతల్ని మెప్పిస్తున్నారు
తమ జాతకాల్ని మార్చుకుంటున్నారు!
ఈ లౌక్యం తెలుసుకున్న
నల్లకాకులన్నీ తెల్లబోయి చూస్తున్నాయి!

- వడ్డేపల్లి కృష్ణ