సాహితి

కథలలో నిండుతనం 29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ చదవడం అయిపోయిన తరువాత, చదువరికి మనసులో ఒక తృప్తి ఎంతసేపూ తన సమయాన్ని వృధాచేయలేదన్న భరోసా కలగాలి. అంటే ప్రతి కథ ‘సుఖాంతం’ అవాలని కాదు, దుఃఖాంతం అయిన కథ కూడా వాతావరణం చక్కగా సమకూర్చి, కథ మధ్యభాగం పరిపుష్టం చేసినట్లయితే అదికూడా ఆమోదదాయకంగానే వుంటుంది. సాధారణంగా వెనకటి కాలంలో కథలన్నీ కంచికి వెళ్లిపోయే తరుణం, ‘అందరూ కులాసాగా వున్నారు. లేకపోతే ఆ మహారాజు పదివేల సంవత్సరాలు తన రాజ్యాన్ని మహావైభవంగా పరిపాలించి స్వర్గానికి వెళ్లిపోయాడు.’ అన్న ధోరణిలో ముగింపు చెబుతాయి. వర్తమానంలో యిలాంటి శ్రమ మనకు లేదు. ఎందుకంటే- కథ ఎప్పటికీ అంతం కాదు. మనం చెప్పదలుచుకున్న సంఘటన, యితివృత్తం పూర్తయిపోయి వుండవచ్చును, కాని కథలో పాత్రలు యింకా బతికే వున్నారు. వాళ్లు తరువాత కార్యకలాపాలు నెరవేర్చుకుంటూ ముందుకుపోతూనే వుంటారు. ఈ విషయం అంతా వేరు వేరు కథలుగా వ్రాసి ‘గొలుసు కథలు’ తయారుచేసుకోవచ్చు.
కథలో తీసుకున్న సన్నివేశాన్ని సమగ్రంగా సంపూర్ణం చేసినప్పుడు అది ‘నిండయిన కథ’ అవుతుంది. కథలో ఒక సమస్య లేవనెత్తినప్పుడు ఆ సమస్యకు సరయిన సమాధానం చివరలో దొరికినట్లయితే అది నిండుతనం వున్న కథ అనుకోవచ్చు. సమస్యను అట్లాగే వదిలేసి, దాని అనేక కోణాలను మాత్రమే ప్రదర్శించి, పరిష్కారం చదువరులకే వదిలివేయడం- వారి ఆలోచనకే ఆలంబనగా తయారుచేయడం మరో పద్ధతి. పాత్రలు మానసికంగా పడుతున్న ‘వేదన’ను తగుమాత్రంగా వ్యక్తీకరించి, చదువరుల సానుభూతిని కలిగేట్టు చేయడం యింకో పద్ధతి. సమస్యతోనే సమాధానం వున్నది- అన్న విషయాన్ని తాత్త్వికంగా ఎత్తిచూపడం, అసలు ‘సమస్య’అనే దానికే మిగల్చకుండా జీర్ణింపచేయడం వేరు పద్ధతి. దీనికి పాత్రలు తమ మానసిక పరిణతితో ప్రవర్తించడాన్ని రచయిత నేర్పుగా చూపించటానికి అవకాశం వుంది.
నిండుతనం తీసుకువచ్చే కథలు వున్నట్లుగానే, ‘నిరాశ’ను నిస్పృహను తీసుకువచ్చి చదువరుల ముందు బోర్లించే కథలు కూడా వుంటాయి. వాతావరణాన్ని సరిగా అర్ధంచేసుకోక పాత్రలు అస్తవ్యస్తంగా ప్రవర్తించినప్పుడు, వస్తువు మంచిదే అయినా చెప్పే తీరు సమంజసంగా లేనప్పుడు రచయిత యేం చెప్పదలుచుకున్నాడో స్పష్టంగాకాకపోయినా, సూచనగానయినా వ్యక్తం కానప్పుడు, ‘నిరాశ’ మిగలడంలో ఆశ్చర్యం లేదు. ఏ రచయితా తన చదువరులను నిరాశలో ముంచటానికి ప్రయత్నించడు. శారీరకంగా కోరుకుంటున్న స్థితిగతులు సమకూడనప్పుడు జీవితం నిరాశ మయం అయిపోతుంది. మానసికంగా తెచ్చిపెట్టుకున్న తృప్తి, సంతృప్తి అతికొద్ది కాలం మటుకే ఊరట యివ్వగలుగుతాయి. నిరాశలో ఎప్పటికీ కూరుకుపోయి వుండాలని మనిషి ప్రయత్నించడు. చుట్టూ అలుముకున్న కారుచీకటిలో కూడా చివరకు ఒక కాంతిరేఖ, వెలుగు కిరణం ప్రసరించినట్లుగా జీవితం కొత్తమలుపులు తిరగాలి. మనిషి నిరంతర ఆశాజీవి. ఆశను పరిమితులలోనే వుంచుకుందుకు ప్రయత్నిస్తాడు. పరిమితి దాటితే అది ‘దురాశ’ అవుతుందనీ, దుఃఖానికి చేటుగా తయారవుతుందనీ అతనికి తెలుసు. అయితే ‘పరిమితిని తెలుసుకుని గమనించడంలోనే ఎన్నోమార్లు బొక్కబోర్లాపడతాడు. పడిపోయిన తరువాత మళ్లీ నిలదొక్కుకుని, లేచి నిలబడి యికముందు ‘అచ్యుతుడు’ (=కిందపడనివాడు)గా వుండిపోవాలని తనకుతాను ధైర్యం చెప్పుకుంటాడు. నిరాశనుంచి నిలకడ, నిండుతనం సంపాదించుకునే తెలివితేటలు ప్రతిమనిషికీ స్వతస్సిద్ధంగా వున్నాయి. కథలలో రుూ స్థితిగతులన్నిటినీ సోదాహరణంగా, సాదృశంగా చూపించటానికి వీలుంది. అందుకనే చదువరులు తప్పనిసరిగా కథలవైపు మొగ్గుచూపిస్తారు.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584