సాహితి

శిరసెత్తితే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదో క్షణాన భూమి పొరల చెరను
విత్తనపు కుత్తుక మొక్కై చీల్చుతుంది
ఆకులు పత్రహరితాన్ని పొదగుకొని
తమ తలల్ని పతాకాల్లా ఎగరేస్తాయి
పారవశ్యం పది నిమిషాలే
స్తబ్దతా తాత్కాలికమే
జడత విడిపోయే మగడే
శ్వాస బలిమిగా ఉంటే చాలు
పంజరాల చువ్వలను చీల్చడం ఒక లెక్కా..!
ఈదురుగాలుల మీద ఊరేగినప్పుడే
విసుగుల ముసుగులు తొలగి
నిర్లిప్తతలు కరిగి నిద్రామేఘాలు తెప్పరిల్లి
నేలబారు నగ్నసత్యాలు కన్పిస్తాయి
ఒంటిమీదికప్పుడే భద్రతా వలయం అంకురిస్తుంది
భావాల దోసిళ్ళు కళ్ళు నులుముకుంటాయి
అరమోడ్పు వేళ్లు ఆశలు సవరించుకుంటాయి
అతికించుకున్న స్తోత్రపత్రాలు జారిపోతాయి
కుళ్లిపోకుండా ఉన్నప్పుడే ప్రాణచికిత్స జరగాలి
గత స్మృతుల రసాయన కషాయాలకు వీడ్కోలు చెప్పాలి
తుంపర్లాంటి సందేశం
ఆకు చెవికి ఇప్పుడు వినిపించింది
లేత చివురును తొడుక్కున్న తాను
కొత్త శ్వాసలకు ప్రాకారమవుతోంది
సవర్ణ దృశ్యాలకు సంగమంగా మారుతోంది
మేఘశయ్యను చిలకరిస్తూ
చల్లని చినుకుకు ఆహ్వాన పత్రం అందిస్తోంది
మబ్బులు తోరణాలకు కనుపాపై మెరుస్తూ
తూర్పు దిక్కు మొనపై
శిరసెత్తి నిలుచుంటోంది..

- తిరునగరి శ్రీనివాస్ 9441464764