సాహితి

ఆకారం ధరించి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎందరి కలలు ఎన్ని రాత్రులు
వేకువ పేరుతో గడిచిపోయాయో
పరిణమించిన క్షణంలోనే
ఉదయపు టెఱగందు నిశ్శబ్దరోదన
అరుణ సూకమై
అంతటా వ్యాపించింది
అజ్ఞానపు జలక్రీడలాడుతున్న వారి కందెఱపై
కాలపు బరువు మోస్తున్న కర్తవ్యమొకటి
కావ్యోద్దిష్ట కల్పనకు సిద్ధమయేలా
సాంధ్య కిరణ బర్హంతో శబల శబ్దమద్దింది..

ఏ పాటకు
పక్షులు గూడు వదిలి ఆకాశ క్షేత్రంలో
కాంతిని అనుగమిస్తాయో
ఆ పరిణాహ నీలిమలో ప్రతిధ్వనిస్తున్న
ప్రాయోజిత స్వరమే
జీవన శిల్పాన్ని ప్రద్యోతం నుండి విడుదల చేస్తుంది
తరాలుగా వరంగాలుగా
ప్రజాప్రవాహం ముందుకు తోసుకుపోతుంటే
నా శ్వాస సోకిన శబ్దాలు
మనో విన్యాస గీతంగా మానవీయ రూపం ధరిస్తాయి..

పర్వతాల పతాక స్థాయిని
మానవుని చిటికెన వ్రేలు నిలిపింది
దారుల ముగింపులసలే లేని
చూపు చివళ్ళకు అహోరాత్రాలు తోరణిల్లాయి
ఇవాల్టి జీవన ప్రస్థానంలోని కోర్కెల బరువుల్ని
తరాలు మోస్తున్నాయి
కొమ్మలు కొనసాగి కొండలకు ఆకుపచ్చని
పులుముతుంటే
అడవి పూల అంతశే్చతనలో
అవిషీప్రవాహాలు ఋతువుల సుళ్ళు తిరుగుతున్నాయి

ఆత్మ నధిరోహించిన ప్రాణం
అనంత యాత్రకు సిద్ధమైంది
గాలి
మెత్తని మేఘాన్ని తోసుకుంటూ
దిగంత రేఖ మీది నిశ్శబ్దానికి ఒక అక్షరాన్ని కానుక చేసింది
ఆకాశం శబ్దాన్ని ఆచమించింది
అకుంఠితమైన దీక్ష నావహింపచేసుకుంటూ
ఉదయించే కిరణాలకు ఎదురుబోయి
విశ్వశూన్యంలో తిరిగే ఒకే ఒక చక్రాన్ని
జాతి వక్షస్థలం మీదకు మలిపాను..

ఉదధులతో ఉర్వీధరాలతో కలిసి జీవించేవాడు
కొలతలకు ఇమడడు
విశ్వాక్షర పదబంధమల్లేవాడు
విషయ నైఘంటికార్థానికి లోబడడు
అవయవ జీవిత రంగస్థలం దాటి
అహాన్ని మీటి
అమృతవర్షిణిరాగాన్ని ఆలపించేవాడు
కర్తవ్యోపమను కావ్యాత్మగీతంగా మలుస్తాడు
నేనింకా ఒక నిశ్శబ్ద పాద రేణువునే
కలమెత్తితే శబ్ద పర్వత బ్రహ్మని..

- సాంధ్యశ్రీ 8106897404