సాహితి

నాచు తెప్పలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓరోజు పొద్దుగాలనే ఎస్.ఎం.ఎస్ వచ్చింది
కండ్లు మూసుకుంట జూసిన.. హ్యాపీ బర్త్‌డే
ఓ కవి పంపిండు
ఓహో! ఫేస్‌బుక్‌లో సూసుంటడు
ఇక ఓదాని తర్వాత ఒకటి, పదిగాలచ్చినయ
జమానా పదో తరగతి కాయతంలున్న డేటాఫ్‌బర్త్
నా పుట్టిన రోజంటే జాతీయ పండుగేమికాదుగని
ఓ క్యాండిల్ వెలుగు, ఓ రెండు రబ్బరు బుగ్గలు
ఓ కేక్, ఓ చాక్లెట్ - ఆ ఉల్లాసం కూడా లేనోన్ని
ఆనకాలమో, సలికాలమో నలుబైయేండ్ల కింద
అవ్వజెప్పిన ముచ్చట యాదికున్నది
అమాసో, పున్నమొ అని
ఇంటికి వోయ మొన్న అవ్వనడిగిన
నాకిప్పుడేడాదికున్నది బిడ్డా! అన్నది
నా పుట్టినరోజు కిందికో... మీదకో తెల్వక
నాకంటే పెద్దోళ్ళ కల్తాన, శిన్నోళ్ళతోని దిరుగుతాన
గియ్యాల నా పుట్టినరోజు మీద క్యాలీ పడ్డది
గా శిఖామణి లెక్క
ఏ పాత ఇనుప పెట్టెలోనో, ఏ అటుకు మీది పాత ముల్లెల్నో
ఎవలన్నరాసి పెడితే ఎంత మంచిగుండునో అనుకుంటి
ఈ గతి లేని పుట్టిన రోజు కోస వెదికే వాల్లెందరో
తెలుసుకునేందుకు ఆరాటమెందరికో
ప్రవహిస్తున్న కాలంలో మేమెరిగిన పదో తరగతి
కాయతంలోని అబద్దపు పుట్టినరోజు మాత్రం
నదిలోని నాచుతెప్పల్లా మమ్ముల్ని తాకి ప్రక్కనుండి వెళ్లిపోతాయ
నడిరేయ నిద్రలో ఓ మెడ పట్టు పట్టుకుని
మెడలు దిరుగకుండా చేసి
మరునాటి నడిరేయ నిద్రలోనే ఆ పట్టు తనకు తానే
పోయనట్టు మా పుట్టినరోజులు

- మంథని శంకర్, 8374354873