సాహితి

సమర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందరికి ఆకాశం చేతికందుతుంది
వారు ధగధగలాడే తారల్ని
హారాలుగా ఆభరణాలుగా ధరిస్తారు
గడప దాటి చంద్రుడు
వారింటిలోకి ప్రవేశిస్తాడు
తన వెంట తెచ్చిన వెనె్నల్ని
వెండి పళ్లెంలో పెట్టి
వారికి కానుకగా సమర్పిస్తాడు
పిల్లగాలి కిటికీలోనుండి పలకరించి
లోపలికి ప్రవేశిస్తుంది
అందర్ని ఆప్యాయంగా నిమిరి
నిదరపుచ్చి వెళ్ళిపోతుంది
వారి కనుసన్నలలో కాలం కదులుతుంది
వాళ్ళ ఆనతిపై పూలు వికసించి వాడిపోతాయి
సూర్యుడు కూడా
వారి ఇష్టానుసారం ఉదయించి అస్తమిస్తాడు
చరిత్ర నిండా
వారి ప్రశంసలు ప్రాబల్యం లిఖించబడుతుంది
భూభ్రమణం కూడా
నియంత్రించగలిగే సాటిలేని సమర్థులు
వీళ్ళంతా ఎదురులేని
మానవాతీత మహాశక్తులు
వేలకువేలు జనులు ఆశ్చర్యంగా వీళ్ళవైపు చూస్తుంటారు
నిదుర మాని చీకటిలో నిశ్శబ్దంగా వేచి వుంటారు

- ప్రొ. లక్ష్మీనారాయణ, 9542656636