సాహితి

కొలకలూరి విశ్రాంతమ్మ నవలా పురస్కారం- 2017

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమతి కొలకలూరి విశ్రాంతమ్మ భాగీరథి పురస్కారంకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డా. కొలకలూరి సుమకిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం గ్రంథ రూపంలో ముద్రిత నవలకు కథానికలకు కడచిన మూడు సంవత్సరాలలో అంటే జనవరి 2014నుంచి డిసెంబర్ 2016 వరకు ముద్రితమైన తెలుగు నవల పురస్కారానికి పరిశీలింపబడుతుందనీ, ఇందుకోసం రచయితలు లేదా ప్రచురణకర్తలు మూడేసి ప్రతులను పరిశీలనార్థం పంపించాలని పేర్కొన్నారు. ఒకే రచయితవి ఒకటికంటే ఎక్కువ పరిశోధనా గ్రంథాలు కూడా పంపవచ్చు. పురస్కారంగా రూ.10,000 నగదు, శాలువ, మొమెంటో ప్రదానం చేస్తారు. నవలా గ్రంథం 18-1-2017లోగా పంపించాలి. ఫిబ్రవరి 15లోగా పురస్కార ప్రకటన, ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో జరిగే సభలో పురస్కారం ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ముద్రిత నవలలను డా.కొలకలూరి సుమకిరణ్, ప్రొఫెసర్, ఆంగ్ల శాఖ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి- 517502, ఆం.ప్ర. చిరునామాకు పంపించాలని ఆ ప్రకటనలో తెలిపారు.