సాహితి

‘వస్తువు’తోనే కథకు చైతన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూపం అంటే రచనాశిల్పం. భాష అభివ్యక్తి కళ. వస్తువులో కళానుభూతి- రసస్ఫూర్తి- కలిగించే సహజసిద్ధమైన సృజనాత్మకశక్తి ఉంటుంది. మరి రచనాశిల్పం ఏమిటి? ఎందుకు? వస్తువులో-్భషలో- సహజసిద్ధంగానున్న కళానుభూతి- రసస్ఫూర్తి- ఉన్నతీకరించడమే రచనా శిల్పం పని. వస్తువులోని కళాత్మక, రసాత్మక స్ఫూర్తి-్భష-రచనాశైలి- కలిసి పనిచేసి అందించే శిల్పం రచనాశిల్పం ఔతుంది. ఆ విధంగా శిల్పీకరించబడి వచ్చిన ఉత్పత్తి రచన ఔతుంది. కథ ఔతుంది. మనసును కదిలించటం, ఆలోచింపజేయటం, చైతన్యపరచటం - వస్తువులోనున్న సహజసిద్ధమైన కళాత్మక, రసాత్మక, సృజనాత్మక విలువలే చేస్తాయి. రచనాశిల్పం ఆ విలువలను ఉన్నతీకరించి, ప్రభావశీలమైన స్ఫూర్తి- ఉత్తేజం- కలిగిస్తుంది. రచనాశిల్పం సహకరించే పరికరం మాత్ర మే. విడిగా చూస్తే, రచనాశిల్పం ఏమీకాదు. తనంతట తాను ఏదీకాదు. స్వయంశక్తిలేదు. సహకరించే పరికరంగానే దాని ఉనికి, విలువ, ప్రయోజనం ఉన్నాయి. చిన్నమాట చెప్పుకుందాం. చలం సాహిత్యం బాగా చదివిస్తుంది. ఎందువల్ల? లైంగిక విషయం ప్రధానాంశం కావటంవల్లే! వస్తువులో సహజసిద్ధమైన ఆకర్షణశక్తి ఉంది. రావిశాస్ర్తీ సాహిత్యంలో వర్గ అసమానత- వర్గ దోపిడీ- ప్రధానాంశం. అవి మనసును భగ్గునమండిస్తాయి. విషాదం-బీభత్సం- మనసును ఉత్తేజపరుస్తాయి; చైతన్యపరుస్తాయి. వస్తువులోనే ఆసక్తి సహజంగా ఉంది. ఇక్కడ మరో చిన్నమాట కూడా- అందరికీ తెలిసిందే- గుర్తుచేసుకుందాం. అలంకారశాస్త్ర ఆచార్యుడు, ఆనందవర్ధనుడు- క్రౌంచవధ ఘట్టం- (బాలకాండ- రెండోసర్గ)- రససిద్ధాంతానికి పునాది వేసిందన్నాడు. ఆ పని వాల్మీకి చేశాడు. ‘‘ఓరీ వ్యాధురా! నీవు చిరకాలం జీవించవు; ఎందుచేతననగా, నీవు ఈ క్రౌంచ పక్షుల జంటలో నొకదానిని కామక్రీడలు సలుపు సమయంలో చంపేశావు.’’ ఇందులోని కరుణారస స్రవంతి, రససిద్ధాంతానికి మూలమైంది. వాఙ్మయ విప్లవానికి పునాది పడింది.
దండి చెప్పిన మాట కూడా గుర్తుచేసుకుందాం. శే్లష-ప్రసాదం- సమత- మాధుర్యం- సుకుమారత- ఆర్థవ్యక్తి- ఓజస్సు- కాంతి- సమాధి- అను పది లక్షణాలు ఉన్న రచనకు శోభను కలిగించేవి- అలంకారములు- అన్నాడు. ఔచిత్యం-అనే లక్షణం తరువాత చేరింది. దీనే్న శిల్పం- అంటున్నాం. దీనివల్ల ఏం తేలింది? వస్తువులో కళాత్మక, రసాత్మక, సృజనాత్మక విలువలు సహజంగా ఉంటాయి. వాటిని శిల్పం ఉన్నతీకరిస్తుంది. శిల్పం సహకరించే పరికరం మాత్రమే. మన మనిషి సొంత అనుభవంలోకూడా ఇదే విషయం స్పష్టవౌతుంది.
ఇప్పడొక గట్టి ప్రశ్న వస్తుంది. వస్తువురూపం వీటిని విడివిడిగా చూడాల్సిన అవసరం ఏముంది? వీటిని విడివిడిగా ఎందుకు చూడాలి? దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇది చారిత్రక తప్పిదంకాదా? నష్టంకాదా? ఇదెలా జరిగింది? విడిగా చూడ్డంవల్ల, వస్తువులోని సహజసిద్ధంగా ఉన్న రూప(శిల్ప) విలువలను పరిగణనలోకి తీసుకోవటం లేదు! ఆధునిక కథ ఆరంభంనుంచి వస్తువు-రూపం గురించి, వాటి ప్రాధాన్యతల గురించి చర్చ జరుగుతూనే ఉంది. కథ పీకకి ఉరితాడు బిగించి కొందరు వస్తువువేపు లాగుతున్నారు; కొందరు రూపంవేపు లాగుతున్నారు. కథని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఎదగకుండా చేస్తున్నారు. అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నారు. పాఠక ప్రపంచంలో అయోమయం సృష్టిస్తున్నారు. వివాదాస్పదం చేస్తున్నారు. పాఠక ప్రపంచం విసుగెత్తిపోతోంది. దీన్ని మనం గుర్తించటం లేదు!
వస్తువు-రూపం వీటిని విడివిడిగా చూడాల్సిన అవసరాన్ని, ప్రయోజనాన్ని నిర్ధారించలేకపోతున్నాం. అంతేకాదు, వాటిని విడివిడిగా చూడాల్సిన అవసరం లేనేలేదనీ, లేదుకాక లేదనీ, గుర్తించలేకపోతున్నాం. మనమే కాదు, తెలిసినంతమేరకు పలు దేశాల్లో, పలు భాషాసాహిత్యాల్లో, ఇదే దుస్థితి కనిపిస్తుంది. మనిషి ముఖం- మొండెం- రెండుముక్కలుగా ఖండించి విడివిడిగా చూస్తే, ఏం తెలుస్తుంది? కథను వస్తువు-రూపంగా ముక్కలుముక్కలుగా ఖండించి, విడివిడిగాచూసే బానిసత్వపు పద్ధతిలోకి వెళ్లిపోయాం. విముక్తికాలేకపోతున్నాం. మన సాహిత్యంలో మరో విషాదం చోటుచేసుకుంది. మన ప్రాచీన సాహిత్యం భాష- ఛందస్సు-వ్యాకరణం- అలంకార శాస్త్రాలు- అనే నాలుగు అంశాలతో సృజింపబడింది. ఇరవయ్యే శతాబ్దికి కొద్దిగా అటూ ఇటూగా ఆధునిక అవసరాలకు, లక్ష్యాలకూ అనుగుణంగా మొదటి మూడు అంశాలు ఆధునీకరింపబడ్డాయి. గ్రాంథిక భాష ప్రజల వ్యావహారిక భాషగా ఆధునీకరింపబడి కావ్య భాష అయింది. పద్యరచన పోయింది. దాంతో ఛందస్సుపోయింది. ఆధునిక ఛందోరీతులు వచ్చాయి. అవికూడా పోతున్నాయి. సౌలభ్యం-సౌకర్యంకోసం- ఆధునీకరింపబడిన రీతిలో ఆధునిక వ్యాకరణాన్ని వాడుతున్నాం. అయితే- ఆవిధంగా నాలుగో అంశం-అలంకార శాస్త్రాలను ఆధునీకరించుకోలేకపోయాం. తిన్నగా, గుడ్డిగా, పాశ్చాత్య కళాసిద్ధాంతాల్లోకి వెళ్లిపోయాం. అవి మన సమాజపు అవసరాలకు, మన ప్రజల సాంస్కృతిక మనోస్థితికి అనుగుణంగా లేవు. అందువల్ల, మనకి ఏ కళాసిద్ధాంతాలూ లేని దుస్థితి ఏర్పడింది. మనకి పూర్తిగా, సమగ్రంగా, అవగాహనకాని పాశ్చాత్య కళాసిద్ధాంతాలతో- అనుకరణ బానిసత్వంలో బతుకుతున్నాం. అదే విధంగా కథను వస్తువురూపంగా విడివిడిగాచూస్తూ అనుకరణ బానిసత్వంలో బతుకుతున్నాం. దానికితోడు వాదోపవాదాలు కూడా! కథ ఆ బానిసత్వపు బతుకునుంచి విముక్తికావాల్సి ఉంది. కథ మొత్తంగా పరిశీలించి, దాని స్థాయి ప్రయోజనం నిర్ధారించే శాస్ర్తియ పద్ధతిని చేపట్టాల్సి ఉంది.

- జయంతి పాపారావు, 8885421949