సాహితి

ఆనవాల్లేకుండా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏరు నదిలో,
నది సంద్రంలో
సంద్రం ఆకాశంలో కలిసిపోయినట్టు
కలిసిపోవటమే!

వసంతం గ్రీష్మంలో
గ్రీష్మం వర్షంలో
వర్షం శిశిరంలో కలిసిపోయినట్టు
కలిసిపోవటమే!

ఉదయకాంతి
నీ కొప్పులో
నీ కొప్పు నా కన్నుల్లో కలిసిపోయినట్టు
కలిసిపోవటమే!

పుట్టుక జీవితాన్ని
జీవితం కాలాన్ని
కాలం మృత్యువును కలిపేసినట్టు
కలిసిపోవటమే...
ఆనవాల్లేకుండా!
*

- ఎం.కె.సుగమ్‌బాబు, 8096615202