సాహితి

‘కల’వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయంకాలం అందులోనూ శీతాకాలం
నీలాకాశం నల్లదుప్పటి కప్పుకుంటోంది
వేకువనే నిద్రపోయన నక్షత్రాలు అప్పుడే మేల్కొన్నాయ
మిణుకుమిణుకుమంటూ నావైపే తొంగిచూస్తున్నాయ
అమావాస్యతో అంతర్థానమైన చంద్రుడికి
మళ్ళీ శాపవిమోచనమైంది
వెనె్నల వెలుగులు నా ఒళ్లంతా పరుచుకుంటున్నాయ
ఇసుక తినె్నలు బంగారు రంగుతో ధగధగలాడుతున్నాయ
కృష్ణానది ఒడ్డున కృష్ణశాస్ర్తిగారి కవితలు నెమరువేస్తూ
నిశ్చలమైన నదిలో గులకరాళ్లు వేస్తూ కాలక్షేపం చేస్తున్నానే్నను
అప్పుడే... సరిగా అప్పుడే ఓ అందెల శబ్దం
నా చెవులను తాకింది
వేయ వీణలు మోగినట్లు... సప్తస్వరాలు మీటినట్లు
ఏదో రూపం మసక మసకగా నాదరికొస్తోంది
వెనె్నల వెలుగు ఆమె ముంగురులను తాకి మెరిసిపోతోంది
వాలుజడ కారు మబ్బులను మరిపిస్తోంది
నాజూకైన నడుము వయ్యారంగా మురిపిస్తోంది
చలం కథల్లో చిలిపితనం
నడిచొస్తున్నట్లుగా కనపడుతోంది
యండమూరి వెనె్నల్లో ఆడపిల్ల గుర్తొస్తోంది
ఆమె రాకతో వెనె్నల వెలుగుల్లోనూ
వెచ్చని గాలి నను తాకుతోంది
పారిజాత పరిమళాలు వెదజల్లుతోంది
ఇంతలోనే రవివర్మ కుంచె నుంచి జాలువారిన అద్భుతం
నా ముందు ప్రత్యక్షమైంది
మాట రాని వౌనమేదో నను చుట్టేసింది
గుండె వేగంగా కొట్టుకోసాగింది
ఏం చెప్పను... ఎలా చెప్పను...
నాలో నేను మధనపడుతుంటే
ఆమె మాత్రం నను చూసి చిన్న చిరునవ్వు నవ్వింది
అంతలోనే నాకు మెలకువ వచ్చింది
పక్కింటి పాప ఏడుపుతో సుప్రభాతం
రోడ్లపై వెళ్లే వాహనాల హారన్ల మోతతో చిరాకు పుట్టింది
అదంతా కలేనని తెలుసుకున్న నేను...
వాస్తవంలోకి దిగాలుగా అడుగులేశాను!

- సంతోష్ ముద్దాన, 7396931399